25.2 C
Hyderabad
May 8, 2024 08: 55 AM
Slider సినిమా

అన్ని ప్రాంతీయ భాషల్లో వస్తున్న ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం

#thekashmirfiles

దేశ వ్యాప్తంగా 400 థియేటర్లలో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై నేడు దేశ వ్యాప్తంగా 4,000కు పైగా థియేటర్లకు పెరిగిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషలలోకి రాబోతున్నది. ముఖ్యంగా దక్షిణాది భాషలు అన్నింటిలో ఈ చిత్రాన్ని తీసుకు వచ్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఈ నెల 11న ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్రం రూ. 100కోట్ల క్ల‌బ్‌ లో అడుగుపెట్టింది. మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, అనుప‌మ్ ఖేర్, ద‌ర్శ‌న్ కుమార్, ప‌ల్ల‌వి జోషి ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన‌ ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కాశ్మీర్ పండిట్‌ల‌పై జ‌రిగిన‌ సామూహిక హ‌త్య‌కాండ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది. 1990లో కాశ్మీర్ పండిట్‌లు ఏ విధంగా హింసించ‌బ‌డ్డారు? ఎలా చంప‌బ‌డ్డారు? వాళ్ళు స్వ‌దేశం నుంచి బ‌లవంత‌గా ఎలా బ‌య‌ట‌కు పంపబ‌డ్డారు? అనే క‌థాంశంతో దర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు.  

రూ 15 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ సినిమా ఇప్పటికే రూ 350 కోట్లకు పైగా వసూలు చేసిన్నట్లు చెబుతున్నారు. ‘హేట్‌స్టోరీ’, ‘ద తాష్కెంట్‌ ఫైల్స్‌’ చిత్రాల దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి ఈ సినిమా తీశారు. దీనికోసం ఆయన నాలుగేళ్లపాటు విస్తృతంగా పనిచేశారు. నాడు కాశ్మీర్‌ నుంచి వలస వచ్చిన తొలితరం పండిట్లను ఇంటర్వ్యూ చేశారు.

Related posts

చీఫ్ ఇన్పర్మేషన్ కమీషనర్ గా ఆర్ యం భాషా ప్రమాణం

Bhavani

రాయలసీమ ప్రాజెక్టులకు బాసటగా నిలవండి…ప్లీజ్

Satyam NEWS

పెండింగు చలానాలు కట్టించేందుకు పోలీసుల‌  ప్రత్యేక డ్రైవ్

Satyam NEWS

Leave a Comment