23.2 C
Hyderabad
May 8, 2024 01: 20 AM
Slider జాతీయం

ప్రామిస్: ఏ పార్టీలో చేరను నా జీవితం బీహారు కే అంకితం

prashanth kishor promised life dedicated to bihar

రాజకీయవేత్తగా మారిన ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ నిండి బహిష్కరింప బడిన ప్రశాంత్‌ కిశోర్‌ మంగళవారం జేడీయూ అధినేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. మంగళవారం ఆయన ఇక్కడ కిక్కిరిసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నితీశ్‌ తనకు తండ్రిలాంటివారని అంటూనే ఆయన ఎన్డీయేతో చేతులు కలపడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.

”నితీశ్‌ నన్నెప్పుడూ కొడుకులా చూసుకునే వారు. ఆయన నాకు తండ్రితో సమానం. అందువల్ల ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నేను దానిని గౌరవిస్తాను. ఆయనే నన్ను పార్టీలోకి తీసుకున్నారు. ఆయనే బహిష్కరించారు. అయినా నితీశ్‌పై వ్యక్తిగతంగా నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు” అని అన్నారు. ప్రశాంత్‌ కిశోర్‌ తన తదుపరి కార్యాచరణ ప్రకటించారు. తాను ఏ పార్టీలో చేరనని, తన జీవితం బీహార్‌కే అంకితమన్నారు.

Related posts

50 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అందించిన హిందుస్థాన్ యూనీలీవ‌ర్‌

Satyam NEWS

ఒమిక్రాన్ నేపథ్యంలో రైళ్లు రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే

Satyam NEWS

ఘ‌నంగా సుంద‌ర‌కాండ పారాయ‌ణం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment