40.2 C
Hyderabad
May 2, 2024 17: 40 PM
Slider జాతీయం

యువతి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు

attack and mob rape

ఒక వివాహ వేడుకలో పరిచయం అయిన వ్యక్తితో సన్నిహితంగా మెలిగినందుకు ఒక యువతి మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ యువతిని వాడు బ్లాక్ మెయిల్ చేసి తన స్నేహితులతో సహా అత్యాచారానికి పాల్పడ్డ దారుణ సంఘటన రాజస్థాన్ లోని చురు జిల్లా తారానగర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో జరిగింది.  

19 ఏళ్ల ఆ యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది. తారానగర్ డీఎస్పీ ఓంప్రకాష్ గోదార చెప్పిన వివరాల ప్రకారం ఒక సంవత్సరం క్రితం ఆ యువతి తమ బంధువు అయిన దేవిపురా తహసీల్ రాజ్‌గఢ్‌కు చెందిన నరేష్ కుమారుడు జగదీష్ జాట్ వివాహానికి హాజరయ్యేందుకు ఖరియా గ్రామానికి వచ్చింది.

అదే వివాహానికి నరేష్ అనే వ్యక్తి కూడా వచ్చాడు. ఆ సమయంలో ఆ యువతి నరేష్‌కు శారీరకంగా దగ్గరయింది. పెళ్లి అయిన తర్వాత ఎవరి గ్రామాలకు వారు వెళ్లారు. అయితే కొన్ని రోజులకు నరేష్ నుంచి ఆ యువతి మొబైల్ నంబర్‌కు కాల్ వచ్చింది.

నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అతను అన్నాడు. అయితే తాను మాట్లాడనని యువతి చెప్పింది. అంతటితో అతను ఆగకుండా తనతో మాట్లాడకపోతే ఆమె కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ భయంతో, ఆమె అతనితో మాట్లాడటం ప్రారంభించింది.

ఆ తర్వాత అతను ఆమె ఊరికి కూడా రావడం మొదలుపెట్టాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. కొన్ని రోజుల తర్వాత డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. తన దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో ఆ అశ్లీల వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు.

జూలై 14వ తేదీ మధ్యాహ్నం నరేష్ ఫోన్ చేసి లక్ష రూపాయలు కావాలని డిమాండ్ చేశాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. నరేష్ తన ఇద్దరు సహచరులతో కలిసి వచ్చి ముగ్గురూ బలవంతంగా ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. నరేష్ డబ్బు ఇవ్వాలని అడిగాడు, ఈ సమయంలో ఆ యువతి అరచేందుకు ప్రయత్నించింది.

అయితే ఆ తర్వాత ముగ్గురు నిందితులు ఆమెను బలవంతంగా వీధిలో పార్క్ చేసిన బొలెరో కారులో ఎక్కించి రతన్‌పురా గ్రామంలోని ఓ ఇంటికి తీసుకెళ్లారని ఆ యువతి చెప్పింది. కారు ప్రయాణంలోనే ఆ యువతిపై వారు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్లి అక్కడ కూడా అత్యాచారం చేశారు. అనంతరం స్కార్పియో కారులో బయలుదేరి అక్కడి నుంచి వారు పరారయ్యారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాధితురాలు జరిగిన విషయాన్ని పొలం నుంచి వచ్చిన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. అనంతరం పోలీస్ స్టేషన్‌కు చేరుకుని నిందితులపై కేసు నమోదు చేశారు.

Related posts

టోల్ ప్లాజా దగ్గర భారీ గా క్యాష్ పట్టివేత

Satyam NEWS

మంత్రి కేటీఆర్ ను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్

Bhavani

పల్లెల్లో కూడా ‘దిశ’ యాప్ వినియోగంపై పోలీసు శాఖ విస్తృత ప్రచారం

Satyam NEWS

Leave a Comment