27.7 C
Hyderabad
May 4, 2024 09: 52 AM
Slider నిజామాబాద్

కామారెడ్డిలో పంచాయతీ కార్యదర్శుల ఆందోళన

#Panchayat Secetaries

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సాయంత్రం 5 గంటల నుంచి పంచాయతీ కార్యదర్శులు ఆందోళన చేపడుతున్నారు. ఉపాధి హామీ పనులను తమ విభాగం నుంచి తొలగించాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. జిల్లాలో 20 శాతం కూడా ఉపాధి హామీ పనులలో వెనకబడి ఉన్న పంచాయతీ కార్యదర్శులకు మెమోలు ఇవ్వడాన్ని నిరసిస్తున్నారు.

ఉపాధి పనులకు కూలీలు రాకపోతే తాము ఎలా బాద్యులమవుతామని ప్రశ్నిస్తున్నారు. తాము చేస్తున్న పనులతో పాటు ఉపాధి హామీ పనులను కూడా తమకు అప్పగించడం సరికాదన్నారు. పనిలో వెనబడ్డారంటూ నోటీసులు ఇవ్వడంతో పాటు ఆ నోటీసులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంజాయిషీ ఇచ్చి నోటీసు తీసుకోవాలని అధికారులు చెప్పడాన్ని ఖండించారు.

తాము దూర ప్రాంతాల్లో విదులు నిర్వర్తిస్తున్నామని, ప్రతి రోజు రావడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అలాగే తాము పని చేయనిదే ఉపాధి హామీ పనులలో  కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందా ఐ ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆందోళన వద్దకు వస్తేనే తాము ఆందోళన విరమిస్తామని పట్టుబట్టి కూర్చున్నారు.

జాయింట్ కలెక్టర్ వచ్చి పది మంది వచ్చి సమస్యను కలెక్టర్ కు వివరించాలని సూచించినా ఉద్యోగులు వినిపించుకోలేదు. కలెక్టర్ వస్తే డిమాండులతో కూడిన వినతిపత్రాన్ని అందజేస్తామని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. కలెక్టర్ బయటకు రాడని అధికారులు అంటున్నారు. కలెక్టర్ వస్తే తప్ప తాము ఆందోళన విరమించేది లేదని కార్యదర్శులు తెగేసి చెప్తున్నారు

Related posts

ఫలించిన శాసనసభ్యుని ప్రయత్నం:తీరిన ఆయకట్టు రైతుల కష్టాలు

Satyam NEWS

అట్టహాసంగా ఐదవ విడత చేపల పంపిణీ కార్యక్రమం

Satyam NEWS

వైసీపీ ఎమ్మెల్యే దూషణలతో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

Leave a Comment