Slider హైదరాబాద్

సిబిఐటి లో పరీక్షా పే చర్చ 2023

#parikshapechercha

భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు నిర్వహించిన పరీక్షా పె చర్చా 2023 కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా సిబిఐటి  మొదటి సంవత్సరం విద్యార్థులకు చూపించారు. విద్యార్థులు ఈ  కార్యక్రమం ద్వారా  పరీక్షలకు సన్నద్ధత, పరీక్షలకు హాజరయ్యేందుకు సంబంధించిన వివిధ సందేహాలకు వివరణలు పొందారు.  ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి, కళాశాల పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్, అధ్యాపకులు తులసి రామ్, డా.ఎం.చంద్ర శేఖర్, ఇతర ఆధ్యాపకులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావడంలో వారు ఎదుర్కొనే వివిధ సమస్యలను వాటిని ఎదుర్కొనే విధానాన్ని ప్రధాన మంత్రి వివరించారు. దీన్ని విద్యార్ధులు శ్రద్ధ గా విన్నారు. కష్టపడి పని చేయడం కంటే స్మార్ట్ వర్క్ అవసరం అనే అంశం గురుంచి తెలుసుకున్నారు. ఇతర విద్యార్థుల నుండి సమాధానాలను కాపీ చేయడం ఎంత ప్రమాదకరమో కూడా విద్యార్ధులు తెలుసుకున్నారు.

Related posts

పెళ్లి వేడుకకు ఊటీ వెళ్లి వస్తే ఇల్లు లూటీ

Satyam NEWS

మజ్లీస్ మద్దతుతో మేయర్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్ధి

Satyam NEWS

నారా లోకేష్ పై దాడి హేయమైన చర్య

Satyam NEWS

Leave a Comment