37.2 C
Hyderabad
May 2, 2024 12: 06 PM
Slider హైదరాబాద్

మజ్లీస్ మద్దతుతో మేయర్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్ధి

#GHMCMayor

జీహెచ్ఎంసీ నూతన మేయర్ గా విజయ లక్ష్మి ఆర్ గద్వాల్, ఉప మేయర్ గా మోతె శ్రీలత లు ఎన్నికయ్యారు. నేడు హైదరాబాద్ మేయర్ ఉప మేయర్ ఎన్నికలను ప్రిసైడింగ్ ఆఫీసర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్  శ్వేతామహంతి నిర్వహించారు.

ఈ ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల పరిశీలకులు సందీప్ సుల్తానియా, జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి, కమీషనర్ లోకేష్ కుమార్ లు హాజరయ్యారు. ముందుగా మేయర్ ఎన్నికను నిర్వహిస్తున్నట్టు, అభ్యర్థి పేరును ఒకరు ప్రతిపాదిస్తే మరొకరు బలపర్చాల్సి ఉంటుందని ప్రకటించారు.

దీనితో బంజారా హిల్స్ గద్వాల్ విజయలక్ష్మి ను ప్రతిపాదిస్తున్నట్టు బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియొద్దీన్ ప్రకటించగా,  గాజుల రామారం కార్పొరేటర్ రావుల శేషగిరి బలపర్చారు. బీజీపీ నుండి ఆర్.కె.పురం కార్పొరేటర్ వి. రాధ పేరును మైలార్ దేవుల పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా,  హిమాయత్ నగర్ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి బలపర్చారు.

ఎంఐఎం పోటీలో లేదు. అక్షర మాల ప్రకారం మేయర్ పదవికి ఎన్నికకై తొలుతగా బీ.జీ.పి అభ్యర్థైన వి. రాధ పేరును పిలవగా బీజీపీ సభ్యులు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యులు లేచి చేతులెత్తడం ద్వారా బలపరిచారు. టీ.ఆర్.ఎస్ అభ్యర్థి అయిన గద్వాల్ విజయలక్ష్మి ఎన్నిక నిర్వహిస్తున్నట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించగా, టీ.ఆర్.ఎస్, ఎం.ఐ.ఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు నిలబడి చేతులెత్తి బల మద్దతు పలికారు.

దీనితో, అత్యధిక సభ్యులు మేయర్ అభ్యర్థి గా గద్వాల్ విజయ లక్ష్మి కి అత్యధిక సభ్యులు ఆమోదించడంతో మేయర్ గా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు. అనంతరం, డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నిక నిర్వహించగా టీ.ఆర్.ఎస్. అభ్యర్థి మోతె శ్రీలత పేరును మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాధ్ ప్రతిపాదించగా, కూకట్ పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ బాల పర్చారు. బిజెపి నుండి బేగంబజార్ కార్పొరేటర్ శంకర్ యాదవ్ పేరును జాంబాగ్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ ప్రతిపాదించగా, అడిక్ మెట్ కార్పొరేటర్ సునీత బలపర్చారు.

దీనితో ఓటింగ్ నిర్వహించగా, టిఆర్ఎస్, ఎం.ఐ.ఎం సభ్యులు నిలబడి చేతులెత్తి మద్దతు పలికారు. బీజేపీ అభ్యర్థి శంకర్ యాదవ్ కు బిజెపి కార్పొరేటర్లు, ఒక ఎక్స్ అఫీషియో సభ్యుడు మద్దతు పలికారు. దీనితో, అత్యధిక సభ్యులు మద్దతు ఉన్న మోతె శ్రీలత డిప్యూటీ మేయర్ గా ఎన్నికైనట్టు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించారు.

మేయర్ గా గద్వాల్ విజయ లక్ష్మి కి, డిప్యూటీ మేయర్ గా మోతె శ్రీలత లకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను రిటర్నింగ్  అధికారి అందచేశారు. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు సహకరించిన సభ్యులకు రిటర్నింగ్ అధికారి ధన్యవాదాలు తెలియ చేశారు. మేయర్, ఉప మేయర్ ఎన్నికకు మొత్తం 149 సభ్యులు హాజరు కాగా, రాజ్యసభ సభ్యులు ఐదుగురిలో ముగ్గురు, 15 మంది ఎమ్మెల్సీ లలో 10 మంది, 21 మంది ఎమ్మెల్యేలలో 20 మంది హాజరయ్యారు.

Related posts

లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడవద్దు

Satyam NEWS

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం చేయడం సరి కాదు

Satyam NEWS

ప్యాకేజీ- 27& 28 తో నిర్మల్ జిల్లా సస్యశ్యామలం

Satyam NEWS

Leave a Comment