41.2 C
Hyderabad
May 4, 2024 17: 23 PM
Slider నల్గొండ

పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదుల సహకారం అవసరం

#HujurnagarCourt

పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి  న్యాయవాదుల సహకారం ఎంతో అవసరమని నూతన జూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తి అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్  నూతన జూనియర్ సివిల్ జడ్జిగా  గురువారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా  బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  ఆయనకు స్వాగత సత్కారం కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి తేజ చక్రవర్తి న్యాయవాదులను ఉద్దేశించి  మాట్లాడుతూ న్యాయవాదులకు , న్యాయ పీఠానికి మధ్య మంచి సంబంధాలు నెలకొన్నప్పుడే న్యాయస్థానాలు సమర్థవంతంగా పనిచేసి  కక్షిదారులకు  సత్వర న్యాయం అందించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం హుజూర్ నగర్ కోర్టు నందు సుమారుగా 5000 కేసులకు పైబడి పెండింగ్లో ఉన్నాయని, అట్టి కేసులను త్వరతగతిన పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించాలని కోరారు.న్యాయవాదులకు ఏవైనా  సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. అనంతరం నూతన న్యాయమూర్తిని శాలువ, పూలమాలలతో న్యాయవాదులు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు సాముల రామిరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి కాల్వ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు చనగాని యాదగిరి, అదనపు ప్రాసిక్యూటర్లు నట్టే సత్యనారాయణ, అంబటి శ్రీనివాసరెడ్డి, న్యాయవాదులు నారపరాజు శ్రీనివాస రావు, శ్రీనివాసుల రవికుమార్, చల్లా కృష్ణయ్య,

కుక్కడపు బాలకృష్ణ, కుక్కడపు సైదులు, కుక్కడపు నరసింహారావు, ఎం ఎస్ రాఘవరావు, బట్టిపల్లి ప్రవీణ్, వట్టికూటి అంజయ్య, చనగాని మహేష్, మీసాల అంజయ్య, పిడమర్తి చంద్రయ్య, రమణారెడ్డి, రామ లక్ష్మారెడ్డి, వి జి కె మూర్తి, లతీఫ్, జుట్టు కొండ సత్యనారాయణ, కొట్టు సురేష్, క్రాంతి కుమార్, పాలేటి శ్రీనివాసరావు, కమతం నాగార్జున,

కానూరి ప్రదీప్తి, సురేష్ నాయక్, శంకర్ నాయక్, వెంకటేష్ నాయక్, శ్రీను నాయక్, చక్రాల వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి, గొట్టె ప్రశాంత్, వెంకటేశ్వర్లు, గోపీనాథ్, నాగేందర్, ఉదారి యాదగిరి, సైదా హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Alter crops: రైతు వేదికలతో పెనుమార్పులకు శ్రీకారం

Satyam NEWS

గరుడ వారధి ఫ్లై ఓవర్  బ్రిడ్జ్ లో పగుళ్లకు కారణాలేమిటి?

Satyam NEWS

Leave a Comment