తెలుగు యువత కార్యకర్త నుంచీ పార్టీలో ఉన్న నన్ను… అధ్యక్షుడు గుర్తించి ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టినందుకు తగిన రుణం తీర్చుకుంటానని టీడీపీ-జనసేన-బీజేపీ విజయనగరం ఎంపీ అభ్యర్ధి కే. అప్పలనాయుడు స్పష్ఠం చేశారు. పార్టీ కార్యాలయం అయిన విజయనగరం అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ అయిదేళ్ల కాలంలి జరగని, అభివృద్ధి కాని పనులను… రానున్న అయాదేళ్లలో పూర్తి చేస్తానని అప్పలనాయుడు ఎన్నికల హామీ ఇచ్చారు. రణస్థలం మండలంలో ఓ మారుమూల గ్రామంలో పుట్టిన నాకు… పార్టీ టిక్కెట్ ఇచ్చినందుకు పార్టీకి, ఎంపీ నియోజక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా పని చేస్తానని ఈ సందర్భంగా కే. అప్పలనాయుడు అన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని ఆదితీ గజపతిరాజు లు పాల్గొన్నారు.
previous post
next post