29.7 C
Hyderabad
May 14, 2024 03: 08 AM
Slider వరంగల్

వృద్ధాప్యపు పింఛన్ వయసు తగ్గింపు సంగతి ఏమైంది?

#CPMMulugu

వృద్ధాప్యపు పింఛన్ల జారీకి వయసును  57 సంవత్సరాకు తగ్గిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని సీపీఎం ములుగు జిల్లా కమిటీ సభ్యులు గుండెబోయిన రవిగౌడ్ ప్రశ్నించారు.

పద్దెనిమిది నెలలుగా రాష్ట్రంలో కొత్త పింఛన్లు జారీచేయక పోవడం దుర్మార్గమైన చర్య అని ఆయన అన్నారు ఈ మేరకు జిల్లా కేంద్రం లోని సీపీఎం కార్యాలయంలో రవిగౌడ్ మాట్లాడుతూ 18 నెలలుగా పింఛన్  మంజూరీ లేకపోవడంతో 65 ఏండ్లు నిండిన వృద్దులు, భర్తలను కోల్పోయిన మహిళలు పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.

ధనిక రాష్ట్రంలో ఇది సరియైనదికాదన్నారు. ఎన్నికల ముందు 57 ఏండ్ల కే వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని చెప్పి 18 నెలలు అయినా పింఛన్లు మంజూరు చేయకపోవడం సరియైన విధానం కాదన్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడే హామీలు అన్నవిధంగా ఉండటం సరియైనది కాదన్నారు. తక్షణమే కొత్త పింఛన్లు జారీ చేయాలనీ  లేనిచో పింఛన్ దారులతో కలెక్టర్ ఆఫీస్ ముందు వంటావార్పు తో ఆందోళన చేస్తామని రవిగౌడ్ హెచ్చరించారు.

Related posts

అరచేతిలో వైకుంఠాన్ని చూపిస్తున్న కేసీఆర్‌

Murali Krishna

శ్రీ పర్వత వర్థిని దేవీ సమేత శ్రీ శాంతి లింగేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితులు అరెస్టు

Satyam NEWS

Leave a Comment