25.2 C
Hyderabad
May 8, 2024 07: 44 AM
Slider కడప

క్లే గ్రావెల్ క్వారీ తమ గ్రామంలో వద్దంటూ  గ్రామస్తుల ఆందోళన

#rajampet

క్లే గ్రావెల్ క్వారీ తమ గ్రామంలో వద్దంటూ అన్నమయ్య రాజంపేట నందలూరు మండలాల్లో శుక్రవారం గ్రామస్తులు ఆందోళన చేశారు. ఆడపూరులో, తాళ్ళపాక లో మైన్స్ సమీపంలో కడప జిల్లా ఆంద్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో వేరు వేరుగా పర్యావరణ ప్రజాభిసేకరణ సభలు నిర్వ హించారు.

9-623 హెక్టార్లలో తాళ్ళపాక లో జి.పి.ఆర్ మైన్స్ కు,ఆడపూరు లో 7-202 హెక్టార్లలో మెసర్స్ ముకుంద మైన్స్ అండ్ మినరల్ కు క్లే గ్రావెల్ క్వారీ కి అనుమతి ఇవ్వగా ఆయా పంచాయతీ సర్పంచ్ లు అనుమతి మాత్రం కావాల్సి ఉంది. అదే విధంగా ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయ సేకరణ సేకరించ వలసి ఉంది.

ఇందులో భాగంగా సభ నిర్వహించగా, సభలో గ్రామస్తులు అధికారులతో వాగ్వాదం చోటుచేసుకుంది. తమ గ్రామంలో మైన్స్ క్వారీ వద్దని నిరసన వ్యక్తం చేశారు. ఇదే విధంగా తాళ్ళపాక సభలో కూడా  క్లే గ్రావెల్ క్వారీ తవ్వకాలు వద్దంటూ ప్రజా ప్రతినిధులు, స్థానికులు అభ్యంతరం తెలిపారు. రెండు సభల్లో అధికారులతో వాగ్వాదం జరుగగా, స్థానికులకు నచ్చ చెప్పేందుకు అధికారులు చేసిన యత్నాల విఫలం అయ్యాయి. దీనితో చేసేది లేక అధికారులు ప్రజా భిప్రాయం నమోదు చేసుకుని వెళ్లారు. 

Related posts

పోయిన ప్రాణం..”సర్వజన హాస్పిటల్ ” నిర్లక్ష్యమా..!

Satyam NEWS

ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఖాయిలా పరిశ్రమలకు ఊతం

Satyam NEWS

శియా గౌతమ్ మరో మహాభారతం ప్రారంభం

Satyam NEWS

Leave a Comment