37.2 C
Hyderabad
May 2, 2024 11: 18 AM
Slider నిజామాబాద్

పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మించేస్తున్నాం

#Hanumanth Shinde MLA

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్దదేవాడ పుల్కల్ గ్రామాల మధ్య కొట్టుకుపోయిన తాత్కాలిక రోడ్డు మరమ్మతు పనులు వెంటనే ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే హనుమంతు షిండే తెలిపారు. పార్లమెంటు సభ్యుడు బి బి పాటిల్ MPLADS నిధుల నుంచి ఇటీవలే రూ.10 లక్షలు మంజూరు చేశారని ఆయన సత్యం న్యూస్ కు తెలిపారు. తాత్కాలిక కాజ్ వే నిర్మాణం పనులలో ఉన్న కాంట్రాక్టర్ బిల్లు రానందువల్ల నిర్మాణపు పనులు నిలిపివేశాడు.

దాంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో కాంట్రాక్టర్ కు పేమెంటు ఇప్పించామని ఆయన తెలిపారు. కొత్తగా నిర్మాణపనులకు ఎంపి నిధులు కూడా ఇచ్చినందున త్వరలోనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Related posts

ప్రాణాలు అడ్డుపెట్టి సేవ చేసిన కార్మికులను పర్మినెంట్ చేయాలి

Satyam NEWS

1.30 లక్షల ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ !

Bhavani

రూ. 4,095 కోట్లతో విశాఖ పోర్టు విస్తరణ

Sub Editor

Leave a Comment