34.2 C
Hyderabad
May 19, 2025 16: 50 PM
Slider సినిమా

సమంత ఛాలెంజ్ ని స్వీకరించిన హీరోయిన్ రష్మిక మందన

#Rahmika Mandanna

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్  ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహా ఉధృతంగా కొనసాగుతోంది ఈ చాలెంజ్ లో భాగంగా నటీనటులు,  ప్రముఖులు పెద్ద ఎత్తున మొక్కలు నాటి తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో తెలియజేస్తున్నారు.

ప్రముఖ హీరోయిన్ అక్కినేని సమంత ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణంలో మొక్కలు నాటిన యువ హీరోయిన్ రష్మిక మందన ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తెలియచేసింది. ఈ చాలెంజ్ లోకి తనను ఆహ్వానించిన సమంతకు కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా తన అభిమానులను అదేవిధంగా యువతీ యువకులను పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఇదేవిధంగా కొనసాగించాలని ఆమె  పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా తన సహ హీరోయిన్లు రాశి ఖన్నా, కళ్యాణి ప్రియదర్శన్ లను ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చింది.

Related posts

పోలీసు ఉద్యోగాలశిక్షణకు ఏప్రియల్ 17న స్క్రీనింగ్ టెస్ట్

Sub Editor 2

వలసకూలీలకు డబ్బులు ఎగ్గొట్టిన మునిసిపల్ కాంట్రాక్టర్

Satyam NEWS

ప్రపంచం మొత్తం…. మాంద్యానికి దగ్గరగా..

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!