30.7 C
Hyderabad
May 5, 2024 04: 50 AM
Slider మహబూబ్ నగర్

దివ్యాంగ బాలబాలికలకు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగకరం

#physiotherapy

దివ్యాంగ బాలబాలికలకు ఫిజియోథెరపిస్ట్ ఆనంద్ కుమార్ ఈరోజు నాగర్ కర్నూల్ మండల పరిధిలోని భవిత విలీన విద్యా వనరుల కేంద్రంలో ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించారు. శారీరక వైకల్యం, చలన వైకల్యం, నరాల బలహీనత ఉన్న దివ్యాంగులకు చికిత్స చేశారు.

ఈ ఫిజియోథెరపీ క్యాంపును జిల్లా విద్యాధికారి గోవింద రాజులు, జిల్లా విలీన విద్యా సమన్వయకర్త  బరపటి వెంకటయ్య పర్యవేక్షించారు. అనంతరం జిల్లా విద్యాధికారి గోవింద రాజులు మాట్లాడుతూ చలన వైకల్యం, శారీరక వైకల్యం గల పిల్లలకు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

18 సంవత్సరాల లోపు వైకల్యం గల బాల‌ బాలికలు ప్రతి బుధవారం నిర్వహించే ఉచిత ఫిజియోథెరపీ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దివ్యాంగ బాలబాలికలకు ఇక్కడ ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా ప్రత్యేక విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఐ ఈ‌ ఆర్ పి ప్రకాష్ , దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్

Related posts

అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతిలో ముఖ్యభాగం

Satyam NEWS

ఓ వైపు వలంటీర్లకు సేవాపతకాలు..మరోవైపు ఆ వలంటీర్లే రోడ్లపై త్రిబుల్ డ్రైవింగ్..!

Satyam NEWS

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశం పాకిస్తాన్

Satyam NEWS

Leave a Comment