27.7 C
Hyderabad
May 12, 2024 05: 44 AM
Slider ప్రపంచం

ఒడిశాలో చైనా గూఢాచారి పావురాలు

ఒడిశాలోని పూరీ జిల్లా- హరే కృష్ణ పుర్ పంచాయితీలో రహంగిరియా గ్రామంలో దొరికిన పావురం కాలికి.. ఆశ్చర్యకరమైన ట్యాగ్ కనిపించింది. దీని కాలికి 37 అనే సంఖ్యతో పాటు.. చైనా లిపితో కూడిన అల్యూమినియం ట్యాగ్ కనిపించింది. ఈ పావురాన్ని గుర్తించిన పోలీసులు మరింత విచారణకు తీసుకెళ్లారు.

సరిహద్దులో చైనా కుట్రలు పన్నుతున్న వేళ.. ఇవి ఏ దేశపు పావురాలు? ఈ విదేశీ పావురాలకు ఇక్కడేం పని? వీటి కాలికున్న ట్యాగ్ లైన్లు ఏం చెబుతున్నాయి? పావురానికి చైనా అక్షరాలున్న ట్యాగ్ ఉండటం దేన్ని సూచిస్తోంది? కొంపదీసి ఇదేమైనా గూఢాచారి పావురమా? ఏంటీ లెక్క? అని ఆరా తీస్తున్నారు ఒడిశా పోలీసులు.

ఒక వేళ ఇది చైనా పావురం అయితే.. ఇక్కడ నుంచి ఎలాంటి సంకేతం పంపుతోంది? అల్యూమినియం ట్యాగ్ లో ఏదైనా చైనా మార్క్ స్కెచ్ దాగుందా? పోలీసు విచారణలో ఏం తేలనుంది? అనేది ఆసక్తికరంగా మారింది. చైనా తాము ప్రయోగించే రాకెట్ లాంచర్ల దూరాన్ని పరీక్షించేందుకే ఇలా చేస్తోందనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది.

ఇలాంటి పావురాలు కొన్ని ఇప్పటికే తమ టార్గెట్ రీచ్ అయితే ఎలాంటి ముప్పు పొంచి ఉందో అనే అంశంపై ఫోకస్ పెట్టారు. ఏది ఏమైనా చైనా చేస్తున్న కుట్రలను ముందుగానే గుర్తించకుంటే ప్రమాదాలు భారీ స్థాయిలో ఉండే ఛాన్స్ ఉందని అనుమానిస్తున్నారు.

Related posts

ముషీరాబాద్ లో స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు

Satyam NEWS

బీసీ నేతలపై బరితెగించి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు

Bhavani

బాలీవుడ్ న‌టుడు దిలీప్ కుమార్ ఆరోగ్యం విష‌మం!

Sub Editor

Leave a Comment