28.7 C
Hyderabad
May 6, 2024 01: 41 AM
Slider జాతీయం

ఉత్తరప్రదేశ్ ఘటనపై సుప్రీం లో పిల్ దాఖలు

Supreme court dismissed lea

ఉత్తర ప్రదేశ్ లోని హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన అత్యాచారం హత్య కేసుకు సంబంధించిన పబ్లిక్ ఇంటరెస్టు లిటిగేషన్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టు ముందుకు రానున్నది.

కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ లేదా సిట్ ను నేరుగా సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షించేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.

ఈ పిల్ ను పరిశీలించాలా వద్దా అనే అంశంపై రేపు విచారణ జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్నా, జస్టిస్ వి రామసుబ్రహ్మణియన్ లు దీనిపై విచారణ జరపనున్నారు.

ఉత్తరప్రదేశ్ నుంచి ఈ కేసును ఢిల్లీకి బదిలీ చేయాలని కూడా ఈ పిల్ లో కోరారు. సత్యమాదూబే అనే సామాజిక కార్యకర్త తరపున దాఖలైన ఈ పిల్ ను సంజీవ్ మల్హోత్రా అనే న్యాయవాది దాఖలు చేశారు.

Related posts

మ్యూజియంల రీఇమేజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించనున్న హైదరాబాద్

Satyam NEWS

వెరైటీ వైరస్: ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా చంపుతున్నది

Satyam NEWS

సమస్యల పరిష్కారం కోసమే ప్రజాగర్జన

Bhavani

Leave a Comment