28.7 C
Hyderabad
April 27, 2024 04: 41 AM
Slider సంపాదకీయం

రాహుల్, బలరామ్ పూర్ రేప్ గురించి తెలియదా?

#RahulGandhi

పాపం రాహుల్ గాంధీ చదివే పత్రికల్లో హత్రాస్ అత్యాచారం సంఘటన ఒక్కటే రిపోర్టు చేసినట్లున్నారు. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఒక దళిత యువతిపై జరిగిన అత్యాచారంపై కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నది. హత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై జరిగిన ఈ సంఘటన తర్వాత అదే ఉత్తర ప్రదేశ్ లోని బలరామ్ పూర్ లో మరో రేప్ కేసు జరిగింది.

22 సంవత్సరాల ఒక యువతిని ఇద్దరు వ్యక్తులు దారుణంగా రేప్ చేసి చంపేశారు. తన కుమార్తె కాలేజీలో చేరేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ముగ్గురు, నలుగురు వ్యక్తులు అడ్డగించారని అత్యాచారానికి గురైన యువతి తల్లి చెప్పారు. తన కుమార్తెను అడ్డగించి వారంతా దారుణానికి ఒడిగట్టారని చావుబతుకుల్లో ఉన్న సమయంలో ఒక రిక్షా ఎక్కించి తమ ఇంటికి పంపించారని బాధితురాలి తల్లి తెలిపింది.

సీరియస్ కండిషన్ లో ఉన్న తమ కుమార్తెను ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపునే మరణించినట్లు ఆమె వివరించింది. ఈ విషయాలన్నీ బలరామ్ పూర్ ఎస్ పి దేవ్ రంజన్ వర్మ ధృవీకరించారు. ఆసుపత్రి వర్గాలు పోలీసులకు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

బలరామ్ పూర్ యువతి కూడా దళిత కుటుంబానికి చెందిన వారే

అఘాయిత్యానికి బలి అయిపోయిన ఈ 22 ఏళ్ల అమ్మాయి కూడా దళితురాలే. దళిత కుటుంబానికి చెందిన హత్రాస్ యువతి లాగానే ఈ 22 ఏళ్ల యువతి కూడా దళిత కుటుంబానికి చెందినదే అయినా కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని ఎక్కడా మాట్లాడటం లేదు.

ఉత్తర ప్రదేశ్ లోనో లేదా దేశంలోని అన్ని రాష్ట్రాలలో జరిగే అత్యాచారాలపై కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తే అభ్యంతరం ఉండటానికి ఆస్కారం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల సంగతి పక్కన పెట్టినా ఉత్తర ప్రదేశ్ అత్యాచారాలపై ఆందోళన చేసినా అందరూ మద్దతు ఇవ్వవచ్చు.

అయితే ఉత్తర ప్రదేశ్ లోనే ఒక దళిత యువతిపై జరిగిన అత్యాచారాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసి ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అదే రాష్ట్రంలో మరో దళిత యువతిపై జరిగిన అత్యాచారాన్ని ఎందుకు ప్రజల ముందుకు తీసుకువెళ్లడం లేదు?

ఎందుకు అంటే బలరామ్ పూర్ లో దళిత యువతిపై అత్యాచారం చేసిన వారి పేర్లు షహీద్, సాహిల్. అర్ధమైంది కదా అందుకే కాంగ్రెస్ పార్టీ బలరామ్ పూర్ సంఘటనను ఎక్కడా ప్రస్తావించడం లేదు. నేషనల్ క్రయిం రికార్డ్స్ బ్యూరో (2019) లెక్కల ప్రకారం ప్రతి లక్ష జనాభాలో రేప్ కేసులు సంఖ్య ను చూస్తే రాజస్థాన్ ప్రధమ స్థానంలో ఉంది.

అక్కడ ప్రతి లక్ష జనాభాలో 15.9 శాతం రేప్ కేసులు నమోదు అయ్యాయి. రెండో స్థానంలో కేరళ ఉంది. అక్కడ ప్రతి లక్ష మందిలో 11.1 శాతం రేప్ కేసులు నమోదు అవుతున్నాయి.

మూడో స్థానంలో అసోమ్ ఉంది. అక్కడ ప్రతి లక్ష మందికి 10.5 శాతం రేప్ కేసులు నమోదు అవుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో 2.8 శాతం రేప్ లు నమోదు అయ్యాయి.

ఇప్పుడు చెప్పండి ఉద్యమం ఎవరి మీద చెయ్యాలి? ఎవరు చెయ్యాలి? రేప్ నకు గురైన దళితుల్లో కూడా వివక్ష చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ న్యాయ నిర్ణేతగా మారతానంటే ఎలా?

సత్యమూర్తి పులిపాక, చీఫ్ ఎడిటర్, సత్యంన్యూస్.నెట్

Related posts

రైతులకు ఏక మొత్తంగా ఋణమాఫీ చేయాలని బ్యాంకు ఎదుట ధర్నా

Satyam NEWS

వీడి ప్రేమ పాడుగానూ… ఇదేం ప్రేమ… ఇదేం దౌర్జన్యం

Satyam NEWS

రామోజీ ఫిల్మ్ సిటీలో వేసేవి కేసినోలా.. క్యాబరేలా.. బెల్లీ డ్యాన్స్ లా..?

Satyam NEWS

Leave a Comment