27.7 C
Hyderabad
May 4, 2024 07: 27 AM
Slider చిత్తూరు

పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత

#Naveen Kumar Reddy

ప్లాస్టిక్ నిషేధం పై ఆంటీ ప్లాస్టిక్ అవేర్నెస్ అసోసియేషన్ నిర్వహించిన ఫేస్బుక్ లైవ్ కార్యక్రమానికి రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అభినందనలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలపై దృష్టి సారించి మూసివేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

ప్లాస్టిక్ వినియోగం కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, ప్లాస్టిక్,ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వ్యర్ధాలను చెరువులలో వేయడం కారణంగా అనేక జీవరాశులు మృత్యువాత పడుతున్నాయని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. చెరువు నీటిని పంటలకు వినియోగించడం కారణంగా కొత్త రకాల క్రిమి కాటకాలతో వేసిన పంట తన సహజ గుణాన్ని కోల్పోతుందని ఆయన తెలిపారు.

ప్లాస్టిక్ వినియోగం కారణంగా చర్మ వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని గ్లోబల్ వార్మింగ్ హెచ్చరిస్తున్నాయని ఆయన తెలిపారు. వినాయక చవితి, దీపావళి పండుగ సమయంలో జరుగుతున్న నీటి, వాతావరణ కాలుష్యంపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ నిషేధం మూడునాళ్ళ ముచ్చటగా మారిందని దీన్ని సరిదిద్దాలని ఆయన కోరారు.

Related posts

షేక్ పేట్ ఎమ్మార్వో భర్త ఆత్మహత్య

Satyam NEWS

పద్మజా ఆస్పత్రి డాక్టర్లకు యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేక అభినందనలు

Satyam NEWS

ఒకే సూర్యుడు..ఒకే ప్రపంచం..ఒకే గ్రిడ్ ఇదే మన నినాదం

Sub Editor

Leave a Comment