42.2 C
Hyderabad
May 3, 2024 17: 49 PM
Slider నిజామాబాద్

ప్లీజ్: మరొక వారం రోజులు ఇళ్లలోనే ఉండాలి

vemula 311

కరోనా నేపథ్యంలో మరో వారం రోజుల పాటు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రజలను కోరారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జనహిత సమావేశ మందిరంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. కరోనా పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని తెలిపారు. కరోనా ధాటిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు బయటి దేశాల నుంచి వచ్చిన వారు 1241, ఇతర రాష్ట్రాల నుంచి 1044 మంది వచ్చారని వారందరినీ హోం క్వారంటైన్ లో ఉంచామని తెలిపారు.

ఇందులో 7 వందల మందికి రేపటితో గడువు పూర్తవుతుందని, మరో వారం రోజుల్లో అందరి గడువు పూర్తవుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 26 మందికి కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో గాంధీ ఆస్పత్రికి తరలించగా అందులో 23 మందికి నెగెటివ్ వచ్చిందని, మరో ముగ్గురి రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు.

దేవునిపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య అనే వ్యక్తి కిమ్స్ ఆస్పత్రిలో పరీక్షలు చేసుకోగా అతనికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. దాంతో అతనితో సన్నిహితంగా ఉన్న 30 మందికి హోమ్ క్వారంటైన్ లో ఉంచామని తెలిపారు. ఇప్పటికే దేవునిపల్లి గ్రామంలో 3 కిలోమీటర్ల మేర స్ప్రే చేశారని, ఆ ప్రాంతంలో సుమారు 10 వేల ఇళ్లలో 50 వేల మందికి ఇళ్లలో 104 టీంలతో సర్వే చేయిస్తున్నామని తెలిపారు.

జిల్లాలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి లో ప్రభుత్వ క్వారంటైన్ లు 165 మంది ఉండేలా ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు మే 31 వరకు సరిపడ తెప్పించి గోదాంలలో భద్రపరిచామని అన్నారు. జిల్లాలో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు.

గతంలో 230 కేంద్రాలున్న వరి కొనుగోలు కేంద్రాలను 320కి, 10 నుంచి 50 వరకు శనగలు, 32 నుంచి 39 వరకు మొక్కజొన్న కేంద్రాలు, 6 నుంచి 28 వరకు జొన్న కొంజగోలు కేంద్రాలను పెంచామని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేష్ దొత్రే, తేజాస్ నందన్ లాల్ పవార్ పాల్గొన్నారు.

Related posts

అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక 

Satyam NEWS

ఇక నుంచీ విజ‌య‌న‌గ‌రంలోని తొట‌పాలెం రోడ్ లో ట్రాఫిక్ జామ్ కు స్వ‌స్థి

Satyam NEWS

ఎందుకో అంత హర్షం

Satyam NEWS

Leave a Comment