40.2 C
Hyderabad
April 29, 2024 17: 37 PM
Slider నిజామాబాద్

కరోనా వ్యాప్తి ఆపేందుకు మనం ఇళ్లలోనే ఉందాం

bichkunda 311

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి  అందరూ ఇళ్లలోనే ఉండి  వైరస్ ను అడ్డుకుందామని బిచ్కుంద ఎంపీపీ అశోక్ పటేల్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు వ్యాపారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యాపార వాణిజ్య సంస్థల నిర్వాహకులు సమయ పాలన పాటించాలన్నారు.

ప్రతి ఒక్కరూ వ్యాపార సముదాయాల వద్ద చేతులు  శుభ్రత కొరకు నీటిని సబ్బు ఉంచాలన్నారు. కూరగాయల అమ్మకందారులు ఒకే చోట కాకుండా పలు కూడళ్ల వద్ద ఉదయం నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూరగాయలు అమ్ముకోవాలని సూచించారు.

మధ్యాహ్నం తర్వాత ఏ ఒక్కరూ బయటకు కనబడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్ని దుకాణ సముదాయాలు మధ్యాహ్నం రెండు తర్వాత మూసివేయాలన్నారు. రానున్న శ్రీరామనవమి వేడుకలను ఈ సందర్భంగా రద్దు చేస్తున్నట్లు వారు ప్రకటించారు.

ప్రతి ఒక్కరు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల బాధ్యత  తో ఇంటి నుండి బయటకు రాకుండా ఉండేందుకు సహకరించాలని మరోసారి సమావేశం లొ స్పష్టం చేశారు. అలా వస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటారని ఈ సమావేశంలో మరోసారి గుర్తు  చేశారు.

ఎవరైనా ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు నిత్యావసర సరుకులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ వెంకటరావు అన్నారు. మధ్యాహ్నం తర్వాత ఎవరూ బయట  కనబడ్డా తీవ్ర చర్యలు తప్పవని ఎస్సై కృష్ణ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి అశోక్ పటేల్ తహశీల్దార్ వెంకట్రావు ఎస్సై కృష్ణ ఎంపిడిఓ ఆనంద్ సొసైటీ అధ్యక్షులు బాలాజీ మాజీ జడ్పిటిసి సాయిరాం మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు, నూకల రాజు .రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్  పటేల్ పాల్గొన్నారు.

ఇంకా రామమందిరం కమిటీ అధ్యక్షులు బొమ్మల లక్ష్మణ్ మండల పరిషత్ అధికారి మెహబూబ్, ఆరోగ్య బోధకులు దస్తీ రామ్, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీహర్ష ఎంపిటిసి సురేష్ నాయకులు  కథగా౦ మాజీ సర్పంచ్ హనుమాన్లు, డాక్టర్ రాజు ధన్ సింగ్ కిరాణా పురుగుల మందుల, మటన్ చికెన్ కూరగాయల వ్యాపారులు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

మురుగన్ పై 112 పేజీల అభియోగ పత్రం

Satyam NEWS

నేరాలలో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ

Satyam NEWS

స్కూలు మానేసిన వారిని తిరిగి చేర్చాలి

Bhavani

Leave a Comment