37.2 C
Hyderabad
May 6, 2024 12: 29 PM
Slider నల్గొండ

సూర్యాపేట జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ పై  చర్యలు తీసుకోవాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్ర ముస్లిం మైనార్టీ నాయకులు సి.ఈ.ఓ. కి పోస్ట్ కార్డుల ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు ఎండి.అజీజ్ పాషా, షేక్.జానీ నవాబ్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ యం.డి.మహమూద్ ఉస్మానియా షాపింగ్ కాంప్లెక్స్ లోని లీజుదారులతో కలసి వక్ఫ్ బోర్డ్ నియమ నిబంధనలకు విరుద్ధంగా పాత కాంప్లెక్స్ లోని 9వ,నెంబర్ షాపుకు తప్పుడు నివేదిక సమర్పించి పై అధికారులను తప్పుదోవ పట్టించి తప్పుడు ఆర్డర్ ఇప్పించారని అన్నారు.

21 ఫిబ్రవరి 2022 ఉస్మానియా కాంప్లెక్స్ అద్దెల విషయంలో సిఈఓ ఇచ్చిన ఉత్తర్వులలో ప్రతి నెల 5వ,తేదీ లోపు పెంచిన నూతన అద్దెలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా ఇంత వరకు వసూలు చేయలేదని అన్నారు.మహమూద్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అన్ని ఏరియాలలో వివాదాలు సృష్టిస్తూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గడిచిన 13 నెలల పెండింగ్ అద్దెలు వసూలు చేసి ఇమామ్,మౌజాన్, ఇతర సిబ్బందికి ఇవ్వాల్సిన జీతాలు కూడా ఇవ్వకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని అన్నారు.

షాపు నెంబర్ 9 ఉత్తర్వులను రద్దు చేయాలని,ఇన్స్పెక్టర్ పై సమగ్ర దర్యాప్తు జరిపించి,శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని,బాధ్యతల నుండి తొలగించాలని,ముస్లిమ్ ఆస్తులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎం.ఏ అబ్దుల్ రహీం పాషా,పఠాన్ గౌస్ ఖాన్,సలావుద్దీన్ సిరాజుద్దీన్, రసూల్, ఇబ్రహీం, డ్రైవర్ ముస్తఫా,అల్లావుద్దీన్,అక్బర్   భాషా,మీరా,జానీ,కరీం, మోహిన్, నయీమ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఆజాదీకా అమృత్ మహోత్సవ్: రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో ఫ్రీడమ్ వాక్

Satyam NEWS

ప్రపంచ ఓజోన్ డే కవితల పోటీకి విశేష స్పందన

Satyam NEWS

సీఎం జగన్ తన పథకాలతో పేద ప్రజల గుండెల్లో చిరస్థానం

Bhavani

Leave a Comment