37.2 C
Hyderabad
May 2, 2024 11: 30 AM
Slider వరంగల్

అందరూ కలిసిమెలిసి ఉండేందుకే లోక్ అదాలత్ కార్యక్రమం

#lokadalat

సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశ్యంతో జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో లోక్అదాలత్ లను నిర్వహిస్తున్నామని ములుగు జిల్లా జూనియర్ సివిల్ జడ్జి, మండల్ న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ నాదెండ్ల రామచంద్ర రావు అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈరోజు ములుగు జిల్లా కోర్టు ఆవరణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నాదెండ్ల రామచంద్ర రావు తో బాటు ముఖ్యఅతిథిగా APPO పావని హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు కాంప్రమైజ్ కోసం వచ్చిన  ఇరువర్గాల కక్షిదారులను  ఉద్దేశించి  మాట్లాడారు. క్రిమినల్, సివిల్ కేసులు బ్యాంక్ కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, భూతగాదాలు కేసులు, కొట్టుకునే కేసులు పరిష్కరించేందుకు లోక్ అదాలత్ లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం ములుగు సీఐ గుంటి శ్రీధర్, ఎస్ఐ ఓంకార్ యాదవ్ ఇరు వర్గాల కక్షిదారు లను ఉద్దేశించి మాట్లాడారు. మొదట భూమి తగాదా కేసు వచ్చింది. వెంకటాపురం మండలం బర్గలేని పల్లె గ్రామానికి చెందిన వైనాలకుమార్, వైనాల సరిత, రేసోజు రాజమ్మ, రేసోజు రమాదేవి, ఈశ్వరాచారీ లకు భూతగాదా కేసును కాంప్రమైజ్ చేసి  పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలోAGP బాలుగుచంద్రయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చక్రవర్తుల వేణుగోపాలచారి, Y. నర్సిరెడ్డి ,M వినయ్ కుమార్,M మహేందర్, రాజేందర్  కోర్టు సిబ్బంది, కోర్టు కానిస్టేబుల్స్ ఇరువర్గాల ప్రజలు పాల్గొన్నారు.

Related posts

తెలుగు దేశం నగర పార్టీ అధ్యక్షుడు గా ప్రసాదుల…!

Bhavani

శ‌ర్వానంద్‌ ‘మ‌హాస‌ముద్రం’ ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే నేనే ధర్నాకు దిగుతా

Satyam NEWS

Leave a Comment