26.7 C
Hyderabad
May 3, 2024 08: 21 AM
Slider ప్రత్యేకం

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని జగన్ హామీ

#Polavaram Project

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన ఆ తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందిస్తామని హామీ ఇచ్చారు.

అంతకుముందు హెలికాప్టర్ లో పోలవరం చేరుకున్న సీఎంకు ఘనస్వాగతం లభించింది.

మంత్రులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఆళ్ల నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత తదితరులు స్వాగతం పలికారు.

Related posts

తెలంగాణలో మారిన బ్యాంకు పని వేళలు

Satyam NEWS

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు ఘనంగా నివాళులు

Satyam NEWS

పోలింగ్ వ‌ద్ద భ‌ద్ర‌త‌ ప‌రిశీలించిన విజయనగరం ఎస్పీ దీపిక

Satyam NEWS

Leave a Comment