39.2 C
Hyderabad
May 3, 2024 14: 39 PM
Slider కడప

భారీ వర్షాలతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం

అల్పపీడన ప్రభావంతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. చెరువులు, కుంటలు నిండి, గండి పడే అవకాశాలపై ముందస్తుగా క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ వి. హర్షవర్థన్ రాజు ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి ఘటనలు జరగకుండా తక్షణ సహాయక చర్యలు పట్టాలని ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపధ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి సహాయక చర్యలు చేపడుతున్నారు.

భారీ వర్షాలకు విద్యుత్ స్తంభాలు,చెట్లు రోడ్డుపై నేలకొరిగి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలగకుండా జిల్లా పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. అవసరమైన చోట తగిన బందోబస్తు ఏర్పాటుతో పాటు అత్యవసర సహయక బృందాలను అందుబాటులో ఉంచారు.

Related posts

దళిత గిరిజన జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి

Satyam NEWS

కుప్పంలో వైకాపా కుప్పిగంతులు: అది అడ్డగోలు గెలుపు

Satyam NEWS

విజయనగరం ఖాకీలలో పెల్లుబుకుతున్న సేవా దృక్పథం…!

Satyam NEWS

Leave a Comment