సీఎం కేసీఆర్, మంత్రి కే టీ ఆర్ ల పై వాట్సప్ గ్రూపులో అసభ్య వీడియో పెట్టి ఇతర గ్రూపులో ఫార్వార్డ్ చేసిన వ్యక్తులు, అడ్మిన్ ల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని బెల్లంపల్లికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించి తదుపరి చర్యలు చేపట్టారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బొంతల లక్ష్మి నారాయణ, బండారి మల్లేష్, యాదండ్ల బాలు, యాదండ్ల వెంకటేష్, జూపాక రాజేష్ అనే ఐదుగురు వ్యక్తులు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరంతా ముఖ్యమంత్రిపైనా మంత్రిపైనా అసభ్యకరమైన రీతిలో వాట్సప్ గ్రూప్ లో వీడియో పెట్టినట్లు తమ విచారణలో వెల్లడైందని అందుకోసం వారిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఎసిపి బాలు జాదవ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేసి సిఐ జగదీష్ సిఐ రాజు ఎస్సై కిరణ్ కుమార్ లు ఈ అరెస్టులు చేశారు.
previous post