33.7 C
Hyderabad
April 30, 2024 01: 37 AM
Slider ప్రత్యేకం

మంత్రి బొత్స కొడుకు పెళ్లి విందు…300 మందితో పోలీసు బందోబ‌స్తు…!

#ministerbotsa

ఉమ్మ‌డి ఆంద్ర ప్ర‌దేశ్  లో కాంగ్రెస్ పార్టీకీ ప్రెసిడెంట్ గా ఉండి…రాష్ట్రంలో సీఎం త‌ర్వాత అంత‌టి స్థాయిలో ఉండి మరీ రాష్ట్రాన్ని ఓ చ‌క్రం తిప్పిన‌…స్థానిక నేత‌…మంత్రి  బొత్స స‌త్య‌నారాయ‌ణ‌.ప్ర‌స్తుతం ఏపీ రాష్ట్రంలో విజ‌య‌న‌గ‌రం జిల్లాలో తొమ్మిది నియోజ‌వ‌ర్గాలలో పార్టీ పరంగా  ఎమ్మెల్యేల‌ను గెలిపించుకుని…స‌త్తా చాటి జిల్లాలోనే త‌న మాట‌కుచేత‌కు ఎదురు లేకుండా ఉంటున్న మంత్రి బొత్స కు  ప్రైవేటు కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా  చివ‌ర‌కు పోలీసులు కూడా ప్రొటోకాల్ ప్ర‌కారం..త‌లొగ్గాల్సిన ప‌రిస్థితి వ‌చ్చిందంటే న‌మ్ముతారా..? న‌మ్మాల్సిందే…! ఎందుకంటే  మంత్రి బొత్స కొడుకు డాక్ట‌ర్ సందీప్ కు ఇటీవ‌లే హైద‌రాబాద్ లో వివాహం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా విజ‌య‌న‌గ‌రం జిల్లా యావ‌న్మందికి..పెళ్లి విందును ఏర్పాటు చేసారు.

అదీ  త‌న మాన‌స‌పుత్రికైన సీతం కాలేజీలో. వాస్త‌వానికి అది ప్రైవేటు కార్య‌క్ర‌మ‌మే..కాని మంత్రి బొత్స  ఆహ్వానం మేర‌కు…ప్ర‌భుత్వం నుంచీ ముగ్గురు మంత్రులు రావ‌డంతో అటు ప్రొటోకాల్ ..ఇటు బందోబ‌స్తుకై  దాదాపు 350 మంది   పోలీసు సిబ్బంది త‌మ‌,త‌మ విధులు నిర్వ‌హించారు.సాయంత్రం ఆరుగంట‌ల నుంచీ వివాహ విందు కాగా…మ‌ధ్యాహ్నం…3 గంట‌ల నుంచీ పోలీస్ శాఖ‌..న‌గరంలోని గాజుల‌రేగ వ‌ద్ద ఉన్న సీతం కాలేజీని త‌మ ఆధీనంలో తీసుకుంది. 

ఆ సీతం కాలేజీ కాస్త‌…టూటౌన్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉండ‌టంతో.. స‌గానికి పైగా భ‌ద్ర‌తా బాధ్య‌త‌ల‌ను టూటౌన్ సీఐ ల‌క్ష్మ‌ణ‌రావే మోసార‌నే చెప్పాలి.ప్ర‌ధానంగా సీతం కాలేజీ….హైవే కు ఆనుకుని ఉంది..అదే విధంగా క‌లెక్ట‌రేట్ ఆర్టీఏ, ద్వార‌పూడిబ్రిడ్జి…వంటి ముఖ్య ప్ర‌దేశాలు ఉండ‌టం..విందుకు దాదాపు యాభై వేల మందికి పైగా వ‌స్తార‌ని అంచాన‌వేయ‌డంతో ట్రాఫిక్ సమ‌స్య  ఏర్ప‌డుతోంద‌ని  ముందుగానే ఊహించారు.. విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ డీఎస్పీ అనిల్,ట్రాఫిక్  డీఎస్పీ మోహ‌న్ రావులు.

దీంతో , అటు ఫోర్ వీల‌ర్, ఇటు టూ వీల‌ర్  వాహ‌నాల పార్కింగ్ పై దృష్టి పెట్టి ముందు రోజే  బోర్డులు పెట్టి..కాస్త ప‌ని త‌నంలో వెసులు బాటు క‌ల్పించే చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇక జిల్లా వ్యాప్తంగా స‌ర్పంచ్ నుంచీ  ఎమ్మెల్యే  వ‌ర‌కు ప్ర‌తీ ఒక్కరికీ విందు  కు రావాల‌ని  కార్డు ఇవ్వ‌డంతో.. త‌ద‌నుగుణంగా  అధిక సంఖ్య‌లో అతిధితులు వ‌స్తార‌ని ముందుగానే ఊహించిన పోలీస్ శాఖ‌…ఇత‌ర డివిజ‌న్ ల డీఎస్పీల‌ను కూడా బందోబ‌స్తుకై రంగంలోకి దించింది.ట్రాఫిక్ జామ్ కాకుండా..క‌లెక్ట‌రేట్ జంక్ష‌న్ వ‌ద్ద .  స్వ‌యంగా ట్రాఫిక్ డీఎస్పీ మోహ‌న్ రావు ఘ‌ట‌నా స్థలిలోనే త‌న ఎస్ఐలు భాస్క‌ర‌రావు, హ‌రిబాబు,దామోద‌ర్ రావుల‌తో రోడ్ జామ్ అవ్వ‌కుండా  జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

మ‌ధ్యాహ్నం..మూడు గంట‌ల నుంచీ సీతం కాలేజీ వ‌ద్ద బందోబ‌స్తును స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించిన అడిష‌న‌ల్ ఎస్పీ అనిల్ త‌ద‌నుగుణంగానే సుమారు 300 మంది సిబ్బందిని  రంగంలోకి దించి ఎలాంటి  ఘ‌ట‌న‌ల‌ను చోటు చేసుకోకుండా…అటు ట్రాఫిక్ ఇటు విందు కు ర‌ద్దీని నియంత్రించ‌డంతో పోలీసులు ముఖ్య పాత్ర పోషించార‌నే చెప్పాలి. ముగ్గురు మంత్రుల‌తో పాటు డిప్యూటీ సీఎం,రేంజ్ ఐజీ ఇత‌ర  రాష్ట్ర ఉన్న‌తాదికారులు రావ‌డంతో స్వ‌యంగా ఏఎస్పీ అనిల్ ఆధ్వ‌ర్యంలో ఈ భారీ గా పోలీసులు..బందోబ‌స్తు నిర్వ‌హించి  ఏకంగా శాఖ‌కే గుర్తింపు తెచ్చార‌ని అంటోంది స‌త్యం న్యూస్.నెట్.

Related posts

ఇద్దరు అమ్మాయిల ప్రేమతో  రామ్ గోపాల్ వర్మ “డేంజరస్” 

Satyam NEWS

మహా శివరాత్రి ప్రత్యేకం: ఆది అంతం…. అంతా ఆయనే…

Satyam NEWS

భారత్ నుంచే ఎక్కువ వీడియోలు తీసేస్తున్న YouTube

Satyam NEWS

Leave a Comment