32.2 C
Hyderabad
May 12, 2024 19: 28 PM
Slider జాతీయం

లెస్బియన్ జెండాతో కాళీ మాతను అవమానించేలా వాల్ పోస్టర్

#lenamanimekalai

‘కాళి’ డాక్యుమెంటరీకి సంబంధించిన అభ్యంతరకర పోస్టర్‌పై వివాదం పెరుగుతోంది. ఒక వైపు, ఉత్తరప్రదేశ్‌లో చిత్ర నిర్మాతలపై ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా అదే సమయంలో మత మనోభావాలను దెబ్బతీసినందుకు నిర్మాతలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

‘కాళి’ డాక్యుమెంటరీ పోస్టర్‌లో, కాళి తల్లిగా మారిన నటి ఒక చేతిలో సిగరెట్, మరో చేతిలో LGBTQ (స్వలింగ సంపర్కులకు సంబంధించిన) జెండా ఉంది. ఇంత దారుణంగా ఉన్న అమ్మవారి ఈ రూపాన్ని చూసి అందరూ చలించిపోయారు. సోషల్ మీడియాలో దీనిపై కామెంట్లు వెల్లువెత్తాయి.

చిత్ర నిర్మాతలు మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ, వారిని అరెస్టు చేయాలని ఎంతో మంది డిమాండ్ చేస్తున్నారు. హిందూ దేవుళ్ళను మరియు దేవతలను కించపరిచేలా చిత్రీకరించినందుకు ‘కాళి’ చిత్ర నిర్మాత లీనా మణిమేకలైపై, నేరపూరిత కుట్ర, ప్రార్థనా స్థలంలో నేరం, ఉద్దేశపూర్వకంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై యుపి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

మతపరమైన మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తోనే వారు ఈ విధంగా చేసినట్లు కూడా కాళి మాత భక్తులు అంటున్నారు. అదే సమయంలో, ఈ ఫిల్మ్‌కు చెందిన వివాదాస్పద పోస్టర్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసుల ఐఎఫ్‌ఎస్‌ఓ యూనిట్ ఐపిసి సెక్షన్ 153 ఎ మరియు 295 ఎ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

అయితే మణిమేకలై ట్విటర్ పోస్ట్‌లో ఇలా రాశారు, “నేను కోల్పోయేది ఏమీ లేదు, నేను జీవించి ఉన్నంత వరకు, నేను నిర్భయంగా మాట్లాడే వాయిస్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. దానికి నా ప్రాణం ఖరీదు అయితే, అది ఇవ్వవచ్చు.” అంటూ వివాదాన్ని మరింత ముదిరేలా చేశారు. “ఈ చిత్రంలో ఒక సాయంత్రం కాళి కనిపించి టొరంటో వీధుల్లో తిరగడం ప్రారంభించినట్లు చూపించాము. ఈ సినిమా చూస్తే మీరు నన్ను అరెస్టు చేయాలి అనే డిమాండ్ చేయడానికి బదులుగా, నన్ను మీరంతా ప్రేమించడం మొదలుపెడతారు.” అంటూ లీనా తమిళంలో కూడా పోస్ట్‌ను ఉంచింది.

Related posts

మహిళాదినోత్సవం నాడు అమరావతి మహిళారైతుల అరెస్టు

Satyam NEWS

జర్నలిస్ట్ కోలా నాగేశ్వరరావు కు సన్మానం

Satyam NEWS

బొమ్మ తుపాకీతో హల్ చల్

Murali Krishna

Leave a Comment