33.2 C
Hyderabad
May 3, 2024 23: 44 PM
Slider కడప

మేడా వచ్చాకే దళితులపై కేసులు

#meda

తెలుగుదేశం హయాంలో దళితులపై ఎలాంటి అక్రమ కేసులకు, దౌర్జన్యాలకు తావు లేకుండాప్రశాంతంగా ఉన్నటువంటి రాజంపేట నియోజకవర్గంలో ని ఎమ్మెల్యే మేడా మల్లికార్డు డ్డి వచ్చిన తర్వాత దళితులపై ఏకంగా రౌడీ షీటర్ల కేసులను ఓపెన్ చేశారని ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ టిఎన్ఎ ఎన్ఎఫ్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, తెలుగుయువత రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంనగర్ నరసింహ, పట్టణ ప్రధాన కార్యదర్శి మండెం అబూ బకర్ లు ఆరోపించారు.

అన్నమయ్య జిల్లా రాజంపేట లో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మేడా భూ ఆక్రమణలను నిరూపిస్తామని మా నాయకుడు బత్యాల విసిరిన సవాల్ కు బహిరంగంగా సమాధానం చెప్పలేక దళితులను అవమానిస్తారా అంటూ వైసీపీ చోటా నాయకులతో మీడియా సమావేశం నిర్వహించి పలు ఆరోపణలు చేయించడం ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి కి ఎంత మాత్రం తగదని వారు దుయ్యపట్టారు. మా నాయకుడు బత్యాల చంగల్ రాయుడు ఎమ్మెల్యే సొంత మండలం అయినటువంటి నందలూరు హరిజనవాడకు చెందిన మా పార్టీ టిఎన్ఎస్ఎఫ్ నాయకుడైన నన్ను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించి నిన్ను ఓడిస్తానని స్పష్టంగా చెప్పారె తప్ప అందులో ఎలాంటి రాజకీయం లేదని డిపి దళిత నాయకుడైన వేణుగోపాల్ తెలిపారు.

దానిని ఆసరాగా తీసుకొని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి వాళ్ల పార్టీకి చెందిన చోటా నాయకులు చేత దళితులను రెచ్చగొట్టారని నిరాదరణమైన ఆరోపణ చేస్తూ మీడియా సమావేశం నిర్వహించడం దారుణమన్నారు. నేను కూడా ఒకే దళితున్నేనని నాపై గతంలో స్వయంగా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి రౌడీషీటర్ కేసును ఓపెన్ చేయించినప్పుడు ఇప్పుడు దళితుల గురించి మాట్లాడే వారంతా అప్పుడు ఎందుకు ఎమ్మెల్యే వేండాను ప్రభుత్వం హయాంలో దళితులకు న్యాయం జరిగిందని చెప్పారు. అదే వైసీపీ ప్రభుత్వంలో దళితులు రాష్ట్రమంతటా తీరని అన్యాయం చేశారని తెలిపారు.

ఉదాహరణకు చెప్పుకుంటూ పోతే మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ అయినటువంటి దళితుడైన సుబ్రహ్మణ్యం ను హత్య చేసి వాళ్ళింటికి గిఫ్ట్ గా పంపించిన విషయం మీకు కనబడలేదా అని ఆరోపించారు. అదే విధంగా విద్యార్థి దశనుంచే తిరుపతిలో నాయకుడుగా చలామణి అవుతూ వచ్చారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మకు కంచుకోటగా ఉన్న పెనగలూరు మండ లంలో కూడా రాజకీయం చేసి ఎన్నడూ లేని విధంగా ఎంపీపీని కైవసం చేసుకున్నారని తెలిపారు.

అదేవిధంగా రైల్వేకోడూరు నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ అయితే దళిత నాయకుడైన కొరముట్ల శ్రీనివాసులు చేత తన మద్దతుదారుడుగా నామినేషన్ వేయించి 27 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిపించిన ఘనత బత్యాలదేనని కావాలంటే ప్రస్తుత రైల్వే కోడూరు మీ వైసీపీ ఎమ్మెల్యే కొరముట్లను అడిగి దళితులకు ఏ విధంగా బత్యాల న్యాయం చేస్తున్నాడో తెలుసుకోవాలని చెప్పారు. మల్లికార్జున్ రెడ్డి ఏమైనా రాజంపేట స్థానికుడా ఆయన కూడా పక్క మండలమైన నందలూరు మండల వాసేనని మా నాయకుడు బత్యాల కూడా పక్క మండలమైన కోడూరు వాసేనని రాజకీయాల్లో ఎవరైనా ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చునని అది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అని ఈ విషయాన్ని గతంలో జరిగిన చాలా ప్రెస్ మీట్ లో కూడా మీకు మా నాయకుడు బత్యాల గుర్తు చేశారని తెలిపారు.

మా నాయకుడు బత్యాల కడప నుంచి తిరుపతి వరకు ఎక్కడైనా రాజకీయం చేసే నత్తా ఉందని తెలిపారు. కేవలం రాజంపేట నియోజకవర్గానికి పరిమితమైన ఎమ్మెల్యే మేడాకు మా నాయకుడు భత్యాలకు ఏనుగుకు చీముకు ఉన్నంత తేడా ఉ నిలదీయలేకపోయారని విమర్శించారు. నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం ందని ఇది వైసిపి నాయకులు అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఓసారి ఇంకోసారి అర్హత లేని వారంతా మా నాయకుడిపై విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. దమ్ము ధైర్యం ఉంటే మేడబు ఆక్రమణ పై బహిరంగ చర్చకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు కొండ శ్రీనివాసులు, పసుపులేటి దుర్గాప్రవీణ్, ఎన్.కె. కరీం, జయరాం రెడ్డి, జ్యోతి శివ శంకర్, జనార్దన్ రాజు, రేవూరి శివరామకృష్ణ, జడ శివకుమార్, ఓబిలి మల్లికార్జున్రెడ్డి, మల్లెం నరేష్, అవసాని శివశంకర్ పాల్గొన్నారు.

Related posts

నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్

Satyam NEWS

ఆదిచిన్నకిష్టయ్య కుటుంబానికి ఆర్దిక సాయం

Bhavani

సుప్రీంకు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించిన ప్రశాంత్ భూషణ్

Satyam NEWS

Leave a Comment