39.2 C
Hyderabad
May 4, 2024 22: 03 PM
Slider ప్రత్యేకం

పోలీస్ డైరీ: ఈ రంజాన్ ఖాసిం కు ఆకలి లేని పండుగ కావాలి

#Kamatipura Police

తేదీ:24 ఏప్రిల్ 2020 మధ్యాహ్నం 12 గంటల సమయంలో నేను మా పోలీస్ స్టాఫ్ కలిసి హైదరాబాద్ పాతబస్తీ  కామాటిపురా ఏరియాలోని ఫతే దర్వాజా క్రాస్ రోడ్డు వద్ద లాక్ డౌన్ విధుల్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. అది హుస్సేనీ ఆలం, శాలిబండ, కామాటిపురా పోలీస్ స్టేషన్ పరిధి కలిసే కూడలి.

రోడ్డుపైన వచ్చి పోయే వాహనాలను ఆపి కారణాలు తెలుసుకుని అనవసరంగా రోడ్లపై తిరిగే వారి పై కేసులు బుక్ చేస్తున్నాము. ఆ సమయంలో మా తల మీద సర్రున కాలుతున్న ఎర్రని ఎండ. ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజ్ లు..ఇవేవీ విధినిర్వహణ ముందు పెద్దగా ఇబ్బందులు అనిపించడం లేదు.

సాబ్, మేరే నామ్ మహమ్మద్ ఖాసిం

అప్పుడు… ఒక వ్యక్తి అటుగా నడచి వెళ్తున్నాడు. రోడ్డుపై వేగంగా నడుస్తూ నన్ను దాటి వెళ్తున్నాడు. అప్పుడు నేను అతడ్ని ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడిగా. అప్పుడు అతడు “సాబ్, మేరే నామ్ మహమ్మద్ ఖాసిం, మై మదీనా మే చెప్పల్ కి దుఖాన్ మే కామ్ కర్తా హూ, సాబ్,  రంజాన్ కా మైహీనా షురూ హువహై,  అజ్ పహలే దీన్ కా సహరి,  సుబే 04: 30 షురూ కరికె ఫజర్ కి నమాజ్ పడా సాబ్.” (నాపేరు మహ్మద్ ఖాసి నేను రంజాన్ తొలి రోజు ప్రార్ధన చేశాను) మళ్లీ అతడు “సాబ్, ఇంట్లో బియ్యం అయిపోయాయి. డబ్బులు కూడా అయిపోయాయి.

కిషన్ బాగ్ లో మా సేటు ఉంటాడు. నేను అతని దగ్గరికి డబ్బుల కోసం వెళ్తున్నాను. మా ఇంట్లో నా భార్య, నలుగురు పిల్లలు ఉంటారు. ఒక నెల నుంచి పని లేదు. డబ్బులు లేవు సార్. అందుకే ఈ రంజాన్ పండక్కి డబ్బుల కోసం నేను మా సేట్ దగ్గరకు వెళ్తున్నాను” అన్నాడు.

ఈ సారి రంజాన్ కు ఎక్కడా హడావుడి లేదు

అప్పుడు నేను అతని తొందరగా వెళ్లి రమ్మని చెప్పి పంపించి వేశాను. రంజాన్ మాసం మొదలైంది. ప్రజలు ఒక్కొక్కరుగా రోడ్ల మీదికి వస్తున్నారు. వారికి కావల్సిన కూరగాయలు, పళ్ళు ఇతర అవసరమైన వస్తువులు కొనుక్కుపోవడంలో బిజీ గా ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ వల్ల ఈ సారి పెద్ద రష్ లేదు.

లేదంటే అన్ని రోడ్లు, షాప్స్, వివిధ రకాల వ్యాపారస్తుల, కొనుగోలుదారులతో కిక్కిరిసి ఉండేవి. మా డ్యూటీ లో మేము ఉండగా దాదాపు 1:15 గంటల సమయంలో మళ్లీ ఖాసిమ్ కనిపించాడు. అప్పుడు నేను అతడిని చూసి “క్యా హువా భాయ్ ?  పైసా మిల్ గయా? అనీ అడిగాను. “లేదు సార్, మా సేటు సాయంత్రం 4: 30 కి “అసర్ కి నమాజ్”  తర్వాత రమ్మన్నాడు అన్నాడు.

మళ్లీ డబ్బులు ఇవ్వని యజమాని

ఈరోజు తన కుటుంబం రోజా (ఉపవాసం) మొదలు పెట్టిందని, సాయంత్రం తినడానికి ఏం లేదని చెబుతూ బాధపడుతూ, తనకి 1: 30 గంటలకు “జోహార్ కి నమాజ్” టైం అవుతుందని చెప్పి తన ఇంటికి వడి వడిగా వెళ్ళాడు. మళ్లీ మేం అదే రోజు సాయంత్రం 4 – 6 గంటల సమయంలో అదే స్థలంలో వెహికిల్ చెకింగ్ చేస్తున్నాం.

సాయంత్రం, దాదాపు 5 గంటల సమయంలోఖాసిం మళ్లీ తన సేట్ దగ్గరికి డబ్బుల కోసం వెళ్లాడు.  సాయంత్రం 6:30 నిమిషాలు అవుతున్నది. మా వెహికల్ చెకింగ్ పూర్తయి, ఎన్ని కేసులు బుక్ అయ్యాయో  నేను, మా పోలీస్ స్టాఫ్ చెక్ చేసుకుంటున్నాం. అప్పుడే, ఖాసిం తన సేట్ దగ్గర నుండి వస్తూ, ఇంటికి వెళుతున్నాడు.

ఈ రోజు నీళ్లతోనే రోజా వదలాలి

అతడు కొంచెం ఆందోళనతో ఉన్నాడు. నేను ఖాసింను రమ్మని పిలిచాను. మళ్లీ వివరం అడిగాను.   “నహీ మిలే సాబ్ ”. అబ్ మై ఘర్ జారహాహు. నాకు ఇప్పుడు ఇఫ్తార్ కు టైం ( 6: 40 సాయంత్రం) కావస్తుంది ఇంటికి వెళ్లి రోజా (ఉపవాసం) వదలాలి.  నేను వెళ్తాను సార్” అని  అతడు వెళ్తుండగా నేను  అతడిని ఆపి, అతనితో “ఇంటికి వెళ్లి ఇఫ్తార్ విందులో ఏం తింటారు? ఇంట్లో ఏం లేవు కదా”? అని ప్రశ్నించాను.

“అల్లా కి దువా! క్యా కర్తే సాబ్,  మై, మేరే బిబి, ఔర్ బచ్చే,  పానీ పీకే రైనా” (అల్లా దయ ఏం చేయాలి సార్ నేను నా భార్య పిల్లలు నీళ్లు తాగి ఉండాలి) తన ముఖంలో లో ఆందోళన, దిగులు కనిపించాయి. కారు వద్దకు వెళ్లాను. కారు డోరు తెరిచి అప్పటికే అతనికి ఇచ్చేందుకు తెప్పించి పెట్టిన వెజిటేబుల్ బిర్యాని బాక్కులు అందించాను.

మీ ఆకలి తీర్చేందుకు మేం ఉన్నాం

వెళ్లి ఇఫ్తార్ విందు చేయండి. ఇంకా మీకు ఏమైనా అవసరం ఉంటే చెప్పండి మా పోలీస్ తరఫున, మా కామాటిపుర పోలీస్ స్టేషన్ SHO గారి ద్వారా ఈ లాక్ డౌన్ వరకు మీకు రెండు పూటలా సహాయం చేస్తాము అని హామీ ఇచ్చాను. మహమ్మద్ ఖాసిం సంతోషంతో “ బహుత్ షుక్రియ సాబ్”. ఇఫ్తార్ కరికె ఆజ్ కా, మఘ్రిబ్ కీ నమాజ్, 6: 50pm, ఈశా కి నమాజ్ 8: 30pm, తారా బి కి నమాజ్ 9: 00 pm కి సంతోషంగా పూర్తి చేస్తాను సార్” అని చెప్పి తన ఇంటికి వెళ్తుండగా…

అప్పుడే అహలె హదీస్ మజీద్ లోని మైక్ నుండి “ అల్లాహు అక్బర్”. లా ఐలహి, ఇళ్లలహి, మొహమ్మద్ ఉన్  రసూలల్లహి.  (అల్లా తప్ప వేరే దైవం లేదు. మహమ్మద్ ఒక్కడే దేవుని దూత) అనే ఆ జ వినబడుతున్నది. మెహమ్మద్ ఖాసిం రంజాన్ మాసం ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగాలని ఆశిద్దాం.

కేశవ్, సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కామాటిపురా, హైదరాబాద్ సిటీ

(ఇలాంటి మంచి పోలీసు వ్యవస్థపై హైదరాబాద్ పాత బస్తీలో కొందరు దౌర్జన్యం చేస్తున్నారు. అవమానపరుస్తున్నారు. అలా చేయడం మంచిదా? ఆలోచించండి- సత్యం న్యూస్)

Related posts

ఫ్యామిలీ ఫస్ట్.. నేషనల్ నథింగ్

Bhavani

కేంద్రం నిధులకు బొమ్మా బొరుసు

Satyam NEWS

ఆర్.ఎం.పి,పి.ఎం.పి,గ్రామీణ వైద్యుల వ్యవస్థకు న్యాయం చేయండి

Satyam NEWS

Leave a Comment