మహారాష్ట్రలోని పూనే నగరంలోని రైల్వేస్టేషనులో శనివారం ఉదయం ఓ హ్యాండ్ గ్రెనెడ్‌ను రైల్వే పోలీసులు కనుగొన్నారు. అత్యంత రద్దీగా ఉండే పూనే రైల్వేస్టేషనులో హ్యాండ్ గ్రెనెడ్ లభించడంతో పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ను రప్పించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వారు హ్యాండ్ గ్రెనెడ్‌ను ధ్వంసం చేశారు. హ్యాండ్ గ్రెనెడ్ అవశేషాలను పరీక్షించేందుకు పూనేలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషనులో హ్యాండ్ గ్రెనెడ్ ఎవరు పెట్టారనే విషయంపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైల్వేస్టేషనులో పేలుడు సృష్టించేందుకే హ్యాండ్ గ్రెనెడ్ వదిలివెళ్లారా అనే కోణంలో ప్రత్యేక పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో పూనే రైల్వేస్టేషనులో ప్రయాణికులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
previous post