30.3 C
Hyderabad
March 15, 2025 08: 54 AM
Slider నిజామాబాద్

గుడ్ వర్క్: పోలీసులకు మాస్కుల పంపిణీ

#Bichkunda Masks

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ వణికిస్తున్న కరోన వైరస్ నియంత్రణలో భాగంగా తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారుల సేవలు మారువలేమని అఖిల భారతీయ ప్రజాసేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు వడ్ల నారాయణ చారి అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు సూచనల మేరకు కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో నేడు మాస్కులు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ సందర్భంగా ప్రతిఒక్కరు ఇంటి వద్దనే ఉండాలని సూచించారు. మరియు వ్యక్తీగత పరిశుభ్రత పాటించాలన్నారు. సమాచార హక్కుచట్టం 2005 అవగాహన సదస్సులతో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సి.ఇచ్ ఎల్లయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను ప్రతిఒక్కరు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మండల అధ్యక్షుడు శివరాం శ్రీను ఉపాఢ్యక్షుడు జి. నారాయణ, కె. కిషన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లు

Satyam NEWS

రామ‌తీర్ధంలో శైవ క్షేత్రాన్ని సంద‌ర్శించిన విజయనగరం పోలీస్ బాస్

Satyam NEWS

బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి.రఘునాథ్ ను సత్కరించిన పెందోట శ్రీనివాస్

Satyam NEWS

Leave a Comment