36.2 C
Hyderabad
May 7, 2024 12: 39 PM
Slider ముఖ్యంశాలు

టీడీపీ నేతను గుండెలపై తన్నిన పోలీసు అధికారి

#chadalawada

వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాడనే ఆరోపణపై అక్రమంగా అరెస్టు చేసిన టీడీపీ కార్యకర్తలు అనిల్, రాజేశ్ లను వెంటనే విడుదల చేయాలని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో తెలుగుదేశం పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. గుంటూరు-నరసరావుపేట మధ్య భారీగా ట్రాఫిక్ జాం అయింది. గుంటూరు-కర్నూలు హైవేపై టీడీపీ నాయకులు కార్యకర్తలు బైఠాయించారు. ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులు పై పోలీసులు జూలుం ప్రదర్శించారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నరసరావుపేట టిడిపి ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పై పోలీసులు దాడి చేశారు. ఆయను బూట్ కాలుతో గుండెల పై తన్నారు. పోలీసులు చేసిన ఈ పనితో అరవింద బాబు సృహా తప్పి పడిపోయారు. అరవింద బాబు ఆరోగ్య పరిస్థితి విషమం గా మారింది. వెంటనే ఆయనను ఆసుపత్రి కి తరలించారు.

Related posts

పవన్ కల్యాణ్ ఒక తెగిపోయిన గాలిపటం

Satyam NEWS

బివేర్ ఆఫ్ బాట్: హైదరాబాద్ నడి బొడ్డున గబ్బిలాల దిబ్బ

Satyam NEWS

కచ్చితంగా ఇక నుంచి మాస్కులు ధరించాల్సిందే

Satyam NEWS

Leave a Comment