28.7 C
Hyderabad
April 26, 2024 08: 53 AM
Slider తెలంగాణ

రోడ్లు ఊడ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

kishanreddy

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు గత నాలుగు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వచ్ఛ భారత్ కింద దేశవ్యాప్తంగా 10 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని, ఇంకా మరుగుదొడ్లు లేని నివాసాలు ఉంటే వారు కోరుకున్న స్థలాల్లో ప్రభుత్వం కట్టి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ నల్లకుంటలో ఆయన నేడు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు. పలువురికి మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జీహెచ్ఎమ్సీ నిర్దేశించిన స్థలంలో చెత్తను వెయ్యాలని, రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చూసుకోవాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించాలని, దీని వల్ల ప్రపంచంలోనే భారతదేశానికి మంచి గుర్తింపు వచ్చిందన్నారు.

Related posts

చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ నిరాహార దీక్ష

Satyam NEWS

దాడి చేసే పాత నైజం మార్చుకోని తోట త్రిమూర్తులు

Satyam NEWS

కొత్త చీఫ్ సెక్రటరీ గా సోమేశ్ కుమార్

Satyam NEWS

Leave a Comment