భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలి యమ్స్‌ల తరువాత అంతరిక్షయానం చేసే మూడో భార తీయ అమెరికన్‌గా రాజా చారికి నాసా అవకాశం కల్పించింది . నాసా తర్వాతి అంతరిక్షయాత్రలో చంద్రుడు లేదా అంగారక గ్రహంపైకి వ్యోమగాములను పంపనుండగా ఇందుకు ఇప్పటికే నాసా 11 మందిని ఎంపిక చేసింది. వీరిలో అమెరికాలో స్థిరపడ్డ రాజా చారి ఉన్నారు.
ఆయన తండ్రి శ్రీనివాసాచారి హైదరా బాద్ వాసి కాగా అమెరికాలో స్థిరపడ్డారు. రాజా చారి అమెరికా లోని టెస్ట్ పైలట్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికా వాయుసేనలో కల్నల్ గా పనిచేస్తున్నారు. సాంకేతిక అంశాల్లో పట్టు, టీమ్ లీడర్ గా గుర్తింపు వల్లే తనకు అవకాశం వచ్చినట్టు రాజాచారి చెప్పా రు. రెండేళ్ల కఠిన శిక్షణ అనంతరం హోస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్ నుంచి మొత్తం 11 మందికి శుక్ర వారం ఈ అవకాశం కల్పించారు.
కాగా, ఇంతకుముందు భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలి యమ్స్‌లు అంతరిక్షయాత్రలు చేయడం భారతీయులకు తెలిసిన విషయమే.