33.2 C
Hyderabad
May 4, 2024 02: 56 AM
Slider ప్రత్యేకం

అరాచక శక్తులను అదుపు చేయాలి: కమలాసన్ రెడ్డి

#kamalasanreddy

అలాంటి అరాచక శక్తులను కట్టడి చేయగలిగితే మెజారిటీ ప్రజలు సంతోషంగా తమ జీవనం సాగిస్తారు. తద్వారా శాంతి భద్రతలు బాగుంటాయి అని హైదరాబాద్‌ రీజియన్‌ ఇన్స్‌పెక్టర్‌ జనరల్‌ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీస్‌ కార్యాలయానికి వచ్చారు.

ఎస్పీ ఆర్‌ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం ఉమ్మడి జిల్లా ఎస్పీలు, అడిషనల్‌ ఎస్పీలు, డీఎస్పీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గొడవలు సృష్టించే వారెవరైనా సరే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు.

భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు గట్టిగా సమాజంలోకి వెళ్లాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌లలో మంచి వాతావరణం కనిపించేలా సిస్టమ్‌ డెవలప్‌ చేయాలని, నేరగాళ్ల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పారు. విచారణ పారదర్శకంగా జరగాలన్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను డెవలప్‌ చేయాలని చెప్పారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎస్పీ ఆర్‌.వెకటేశ్వర్లు, నాగర్‌కర్నూల్‌ ఎస్పీ మనోహర్‌, గద్వాల ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌, నారాయణపేట ఎస్పీ ఎన్‌ వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ఈనెల 27న జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలి

Satyam NEWS

హెల్త్ అలెవెన్సులు తిరిగి చెల్లించకపోతే పోరాటం

Bhavani

గవిమఠంను సందర్శించిన మంత్రి ఉషశ్రీ చరణ్

Satyam NEWS

Leave a Comment