42.2 C
Hyderabad
May 3, 2024 15: 19 PM
Slider విజయనగరం

హెల్త్ అలెవెన్సులు తిరిగి చెల్లించకపోతే పోరాటం

#AITUC

విజయనగరం మున్సిపల్ కార్పరేషన్ పరిధిలో ఎండనక, వాననక, కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధులు విలయతాండవం చేస్తున్నా ప్రాణాలకు తెగించి శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల అడుగుతున్న న్యాయమైన కోర్కెలను పాలకులు, అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ మండిపడ్డారు.

ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ ఎదుట విజయనగరం మున్సిపల్ వర్కర్స్ ఏఐటీయూసీ అనుబంధ యూనియన్ ఆధ్వర్యంలో యుమియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జలగడుగుల కామేష్ అధ్యక్షతన జరిగిన నిరసన ధర్నా చేసి జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చారు అనంతరం ధర్నాకి నాయకత్వం వహించిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్

మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ నేతృత్వంలో 5 రోజులు సమ్మె చేసి సాధించుకున్న హెల్త్ అలెవెన్స్ ను ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ 5 నెలల నుంచి నిలిపేయడం చాలా దుర్మారం అని ఆగ్రహం వ్యక్తంచేశారు.11వ పిఆర్సి లో వేతనాలు పెరిగాయి అని పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన హెల్త్ అలవెన్సులు గత 5 నెలలుగా చెల్లించకుండా తీవ్ర

ఇబ్బందులకు గురి చేస్తున్నారని తక్షణమే చెల్లించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు. పర్మినెంట్ కార్మికులకు సంబంధించి 2021 డిసెంబర్ నాటికి చెల్లించాల్సిన సరెండర్ లీవ్ ల ఎన్క్యాష్మెంట్ ఇంతవరకు ప్రభుత్వం జమ

చేయలేదన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు కళ్యాణ్ శ్రీను, దసమంతుల గణేష్, కోడూరు. చిరంజీవి, శ్యామ్ మరియు రిటైర్ అయిన కార్మికుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

థాంక్స్ టు మినిష్టర్ కేసీఆర్

Satyam NEWS

అతి….త్వరలో… బాలయ్య మరో సంచలనం…

Satyam NEWS

భద్రాచల రాముడి పాదాల చెంతకు గోదారమ్మ

Satyam NEWS

Leave a Comment