38.2 C
Hyderabad
May 3, 2024 21: 31 PM
Slider నల్గొండ

మహా సిమెంట్ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్ధారణ క్యాంపు

#maha cement

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మహా సిమెంట్ లారీ కార్యాలయంలో గురువారం క్షయ వ్యాధి నిర్ధారణ క్యాంపును నిర్వహించారు.

ఈ క్యాంపులో అనుమానిత క్షయ వ్యాధి గ్రస్థులైన 18 మందికి పరీక్షలు నిర్వహించారు. జిల్లా టిబి నిర్మూలన అధికారి డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ఎండీ నిరంజన్,డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వారాల మించి దగ్గు,సాయంత్రం పూట జరం వచ్చినా,బరువు తగ్గినా,ఆకలి మందగించినా ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  మెళ్ళచేరువు నందు పరీక్షలు నిర్వహిస్తారని,6 నెలల వరకు ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు న్యూట్రీషన్ ఆహారం కొరకు ప్రతి నెల 500 రూపాయలు వారి బ్యాంకు అకౌంట్ లో జమ చేస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మహా సిమెంటు సినియర్ డిజిఎం పార్థసారథి, డాక్టర్ ఫణిభూషణం, డాక్టర్ వినయ్, బందెల రాములు,టిబి సూపర్వైజర్ లక్ష్మీ,అరుణ,శ్రీనివాసరెడ్డి, లాబ్ టెక్నీషియన్స్ లక్ష్మీ,ఎ.ఎన్.ఎం.కళ్యాణి, స్వప్న,ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంచిర్యాల ప్రభుత్వ దావఖాన లో హత్య

Bhavani

కరోనా కట్టడిలో విఫలమైన ఏపిలో కేంద్రం జోక్యం

Satyam NEWS

మచ్చలేని మహానేత గిరిప్రసాద్

Bhavani

Leave a Comment