27.7 C
Hyderabad
May 4, 2024 10: 30 AM
Slider గుంటూరు

సామాజిక బస్సు యాత్రలో చంపిన వాళ్ళ గూర్చి కూడా చెప్తారా?

#balakotaiah

వైసీపీ పార్టీ చేపడుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో నాలుగున్నరేళ్ళ ప్రభుత్వ పాలనలో చంపబడిన, నేలకొరిగిన దళిత బాదితుల గూర్చి కూడా చెప్పాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య వైసీపీ నాయకులకు సూచించారు.  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో సామాజిక యుద్ధభేరి పేరిట చేపట్టిన బస్సు యాత్ర తుస్సు మందని, మళ్లీ కొత్త రూపంలో సాధికార  యాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. యాత్రకు నిర్మాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే, యాత్ర సారధులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, తలసిల రఘురాం చౌదరి అని, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  అన్నారు.

యాత్రలో డ్యాన్సులు, ఫైట్లు అంబటి రాంబాబు, జోగి రమేష్, కొడాలి నాని, బొత్స సత్యనారాయణ లాంటి వారు ఉండవచ్చని, మంత్రి రోజా ప్రత్యేక పాత్రలో ఐటెం సాంగ్స్ లో ఉంటుందేమో అన్నారు. బస్సుకు వెనుక, ముందు డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఒంగోలు నూకానమ్మ, అమర్నాథ్ ఫోటోలను కూడా అంటించాలని యాత్ర నిర్వహణకు సూచించారు. 27 రకాల దళితుల సంక్షేమ పథకాలను ఎత్తివేసి, దాదాపు 33 వేల కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను  దారి మళ్ళించి, కార్పొరేషన్లకు నిధులు లేకుండా చేసి, అంబేద్కర్ విదేశీ విద్య పేరును దొంగిలించి, మాజీ మంత్రి విశ్వరూప్ ఇల్లు తగలబెట్టి, ఎస్సీ లపై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిన విషయాన్ని దళితులు మర్చిపో లేరన్నారు.  సామాజిక న్యాయం అనే మాట కానీ, మాట్లాడే అర్హత కానీ వైసీపీకి లేదని బాలకోటయ్య తేల్చి చెప్పారు.

Related posts

కెమికల్స్ లేని శానిటరీ న్యాప్ కిన్స్ ఉచితంగా అందించాలి

Satyam NEWS

న్యూ బిగినింగ్: బాధ్యతలు స్వీకరించిన సుధీర్ రెడ్డి

Satyam NEWS

రక్తదానం చేయడం అంటే ప్రాణం నిలబెట్టడమే

Satyam NEWS

Leave a Comment