38.2 C
Hyderabad
May 2, 2024 19: 26 PM
Slider ప్రత్యేకం

సత్యం న్యూస్ కథనంపై ఘర్షణ కు దిగిన ఐస్క్రీం యజమాన్యం

#ice cream

చిన్న పిల్లల ప్రాణాలతో చెలగాటం సత్యం న్యూస్ లో  కథనం వ్రాసిన జర్నలిస్టుతో ఆదివారం ఐస్క్రీం యజమానులు కూన యాదయ్య ఘర్షణకు  దిగారు. మేము 30 సంవత్సరముల నుండి ఈ వ్యాపారం చేస్తున్నామని మమ్ము  అడిగేవారు ఎవరని మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని దురుసుగా మాట్లాడడమే గాక నీ అంతు చూస్తానని, నీపై  మా పని వారితో అట్రాసిటీ కేసు  పెట్టి ఇస్తానని భయబ్రాంతులకు గురి చేసి ఘర్షణ కు దిగారు.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో హైదరాబాద్ కూడలి దగ్గరలో మార్కెట్ వెళ్లే దారిలో కుడివైపున పాత గోడల్లో పసివాళ్ళ ప్రాణాలు తీసేందుకు అన్నట్లు ఐస్క్రీములు చేస్తున్నారని శనివారం వచ్చిన కథనం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆవేశంతో సత్యం న్యూస్ జర్నలిస్ట్ తో వాగ్వాదానికి దిగారు.

తాము 30 సంవత్సరాల నుండి ఈ వ్యాపారంలో  ఆరితేరామని ఏ అధికారులో మా ముందుకు కు రమ్మనమని వారి అంతు కూడా చూస్తామని అన్ పార్లమెంట్ పదజాలంతో అధికారులను సైతం దూషించారు. ఇట్టి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళితే న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.

చట్ట వ్యతిరేక పనులు చేస్తూ జర్నలిజం పై దాడి

చట్ట వ్యతిరేక పనులు చేస్తూ రిపోర్టర్ల పై దాడులు చేయడం మరికొందరు అట్రాసిటీ, లేదా డబ్బులు డిమాండ్ చేశారని, పలు విధాలుగా జర్నలిజం చేసే జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు.  భార్య పిల్లలు ఉండి కూడా ప్రాణాలకు తెగించి

అవినీతిని బయట పెట్టే విలేకరులను కాపాడుకోవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా పోలీసుల కంటే ముందుండేది జర్నలిస్టు లేనని అందరూ గుర్తించాలి. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా  సమాచారం అందించే ది జర్నలిస్టే. అటువంటిది చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వారి బండారం బయట పెట్టడంతో వ్యతిరేక పనులు చేస్తున్న వారిని వదిలేసి జర్నలిస్టులపై కేసులు నమోదు చేస్తున్నా సంఘటనలు చాలానే ఉన్నాయి.

చట్ట వ్యతిరేక పనులు చేసే వారిని వదిలేసి వారు ఇచ్చే తప్పుడు సమాచారంతో అమాయకులైన విలేకరుల పై కేసులు పెట్టి దర్జాగా వారు యధావిధిగా వారి పనులు వారు చేసుకుంటున్నారు. భారత రాజ్యాంగంలోని అధికరణ 51 ఏ ప్రకారం ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ప్రతి భారత పౌరుని బాధ్యత అని చట్టం చెబుతోంది. ఇకనైనా చట్ట వ్యతిరేక పనులు చేసే వారిని వదిలేసి జర్నలిస్టుల పై తప్పుడు కేసులు చేయకుండా ఉంటే బాగుంటుంది.

Related posts

శివోహం: కిటకిటలాడుతున్న కడప జిల్లా శైవక్షేత్రాలు

Satyam NEWS

నామ సంస్థ ఆస్తుల జప్తు

Satyam NEWS

అన్ని ప్రధాన పట్టణాలలో 5జి సేవలు

Bhavani

Leave a Comment