29.7 C
Hyderabad
May 4, 2024 06: 50 AM
Slider

తీర్ధాల జాతరకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు: పోలీస్ కమిషనర్

మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. సోమవారం ఖమ్మం రూరల్ మండలంలోని తీర్ధాల సంగమేశ్వర స్వామి ఆలయాన్ని పోలీస్ కమిషనర్ సందర్శించారు. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుడా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.నిర్వహుకులు ఆలయ స్వాగత ద్వారం మొదలుకొని గర్భాలయం వరకు క్యూలైన్లు, చలువ పందిళ్లు ఇప్పటికే పూర్తి చేసిన నేపథ్యంలో పరిసరాలు తిరిగి పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, పార్కింగ్, ఆర్టీసీ బస్ స్టాప్, తదితర ప్రాంతాల దగ్గర బారికేట్ల ఏర్పాటు పరిశీలించి తగిన సూచనలు చేశారు.  వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. స్నానపు ఘాట్ , ఇతర ప్రాంతాలలో  నిరంతర విద్యుత్ కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేవిధంగా అధికారులతో సమన్వయం చేసుకొవాలని సూచించారు.  భక్తుల వాహనాల పార్కింగ్ కోసం కేటాయించిన స్ధలంలో వాహనాలు నిలిపే విధంగా చర్యలు తీసుకొవాలన్నారు.పోలీసు బందోబస్తు ACP -04,CI – 15,SI – 35,ASI/HCs – 90,PCs- 350,WPC ‘WHGs- 30,HG,s 100. కార్యక్రమంలో రూరల్ ఏసీపీభస్వారెడ్డి, రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్సై శంకర్  పాల్గొన్నారు.

Related posts

పాపం సమంత వర్రీ అవుతున్న అభిమానులు

Satyam NEWS

మహనీయులను స్మరించుకుంటే మనకు నిత్యస్ఫూర్తి

Satyam NEWS

52 కోట్లతో మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment