31.2 C
Hyderabad
May 3, 2024 02: 39 AM
Slider మహబూబ్ నగర్

నిషేధిత గంజాయి,గుట్కా కోసం కిరాణం షాపుల్లో ముమ్మర తనిఖీలు

#wanaparthy

భారీగా 3,26 లక్షల విలువైన గుట్కాలు స్వాధీనం చేసుకున్నామని వనపర్తి డిఎస్పీ కిరణ్ కుమార్ చెప్పారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారకుండా అందరు సహకరించాలని, యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా  కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదన్నారు.

వనపర్తి జిల్లా ఇంచార్జ్  ఎస్పీ డా. వై.సాయిశేఖర్   ఆదేశాల మేరకు   వనపర్తి డిఎస్పీ కిరణ్ కుమార్  అధ్వర్యంలో వనపర్తి, పెబ్బేరు, అమరచింత, మాదనపూర్, జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల పోలీసు అధికారులు, సిబ్బందితో కలసి, పాన్ షాపులలో, కిరాణా షాపుల్లో ముమ్మరంగా దాడులు నిర్వహించి 3,26,835 లక్షల విలువగల గుట్కాలను స్వాధీనం చేసుకుని సీజ్ కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా  డిఎస్పీ కిరణ్ కుమార్  మాట్లాడుతూ. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, గంజాయి, మరే ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న,  ఇతరులకు విక్రయించిన చట్టప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ఎవరైనా వ్యక్తుల వద్ద మరియు పాన్ షాప్ లలో కిరాణా షాపుల్లో మరే ఇతర  షాపుల్లో నైనా ప్రభుత్వం నిషేధించిన గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలు కలిగి ఉన్నారని లేక విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ 08545-233332 సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని  వారికి తగిన పారితోషికం అందజేస్తామని తెలిపారు. 

వనపర్తి పట్టణంలో 9 షాపులలో తనిఖీ చేయగా 31,550 రూపాయల విలువ గల నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, ఎవరైనా గంజాయి, గుట్కా, గుడుంబా వ్యాపారం చేసినా, నిల్వ చేసుకున్నా, సరఫరా చేసినా, వాడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

తిరుమలలో భక్తుల రద్దీ

Bhavani

యువగళం’ పేరిట నారా లోకేశ్‌ పాదయాత్ర

Bhavani

23న ఏలూరు రానున్న వాటికన్ రాయబారి

Satyam NEWS

1 comment

Vamshi October 24, 2021 at 9:03 AM

This is what

Reply

Leave a Comment