31.2 C
Hyderabad
May 3, 2024 01: 43 AM
Slider నల్గొండ

పల్లె పల్లె కదలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్లచెరువు మండల వేపల మాధారం గ్రామంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా పండుగ కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి గ్రామ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జీ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి పాల్గొని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట తప్పని మహానేత దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల నాయకత్వంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏర్పడటం తెలంగాణకు గొప్ప వరమని అన్నారు.

అధికార తెలంగాణ పార్టీ పూటకొక మాట, గంటకొక హామీ ఇస్తూ కల్లబొల్లి మాటలతో కాలాన్ని వెళ్లదీస్తు రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరికీ సుపరిపాలన అందించి చరిత్ర కెక్కారని, అంతటి మహానుభావుని తనయురాలు  తెలంగాణలో ఆదర్శవంతమైన పాలనను అందించేందుకు సంక్షేమం,సమానత్వం, స్వయం సమృద్ది ఎజెండాగా భవిష్యత్తు తరాల బ్రతుకులకోసం మన ముందుకు వస్తున్నారని తెలిపారు. వైఎస్ షర్మిల కు ప్రతి ఒక్కరూ అండగా ఉండి పల్లె పల్లె కదలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు చెందిన రెండువందల మంది ఆదెర్ల శ్రీనివాస రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో కందుల నరసింహారెడ్డి, షేక్ రఫీ,షేక్ ముస్తఫా,షేక్ ఇబ్రహీం,మల్ల శివ,వెంకీ,గుండెపొంగు గోపి,దాసరి శంకర్, కందుల లక్ష్మారెడ్డి,ఆవుల వెంకటేశ్వర్లు, కుక్కల సైదులు,కందుల గుర్వారెడ్డి, మరియదాసు,మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, బ్రహ్మం,నడిపి,షేక్ అబ్దుల్లా,తిరుపతయ్య, స్వామి,ఇమామ్ సాహెబ్,మల్ రెడ్డి నర్సి రెడ్డి,బొగ్గుల సర్వేశ్ రెడ్డి,బొగ్గుల ఉమా మహేశ్వర్ రెడ్డి,సూరే కోటయ్య,చెడపొంగు రాంబాబు,చాకలి వీరయ్య, రామచంద్రారెడ్డి,షేక్ బిస్మిల్లా,కందుల వెంకట్ రెడ్డి,ఇరిగెల నరేందర్ రెడ్డి,ఇరిగల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సీక్రెట్: అయ్యా ఇదీ కథ.. ఇంకా చెప్పాలా?

Satyam NEWS

ద్రౌపది గా వస్తున్న దీపికా పదుకొనే

Satyam NEWS

శ్రీశైలంలో బ్రిటిష్ కాలం నాటి బంగారు నాణాలు లభ్యం

Satyam NEWS

Leave a Comment