37.2 C
Hyderabad
April 26, 2024 19: 07 PM
Slider పశ్చిమగోదావరి

23న ఏలూరు రానున్న వాటికన్ రాయబారి

#revarend

ఏలూరు నగరంలో ఈనెల 23వ తేదీన వాటికన్ రాయబారి మోస్ట్ రెవరెండ్ లియోఫోర్డ్ జిరెల్లి పర్యటించనున్నారని  ఏలూరు పీఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర తెలిపారు. బిషప్ హౌస్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగర పర్యటనలో భాగంగా ఆర్ సి ఎం చర్చిలో ఉదయం ఏడు గంటలకు దివ్య పూజ 10 గంటలకు పుర ప్రముఖులతో భేటీ అనంతరం దుగ్గిరాలలో ఉన్న సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ని సందర్శిస్తారని తెలిపారు. గౌరీపట్నం లో ఉన్న నిర్మలగిరి క్షేత్రాన్ని దర్శించి దివ్య పూజా బలిని సమర్పిస్తారని తెలిపారు. ఇండియా నేపాల్ రాయబారి లియోఫోర్డ్ జిరెల్లి ఇటలీ దేశంలో జన్మించి 2017 సెప్టెంబర్ 13వ తేదీన వాటికన్ రాయబారిగాను, జెరూసలేము, పాలస్తీనా దేశానికి  20 21 మార్చి 13వ తేదీన ఇండియా నేపాల్ దేశాలకు పరిశుద్ధ పోపు గా నియమితులయ్యారన్నారు. ఈ సమావేశంలో ఫాదర్ డాక్టర్ బాల, ఫాదర్ మైకేల్, ఫాదర్ జి మోజేష్, ఫాదర్ రాజు, ఫాదర్ ఇమ్మానియేల్, ఫాదర్ బాబు జార్జి ఫాదర్ తోట ఆంతోని పాల్గొన్నారు.

Related posts

జయ జయ సాయి ట్రస్ట్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

మూడు ముక్కలైన రాజధానిపై ఉపరాష్ట్రపతి వ్యాఖ్య

Satyam NEWS

పేదల గుండెల్లో వైఎస్సార్ పదిలం

Satyam NEWS

Leave a Comment