29.7 C
Hyderabad
May 3, 2024 06: 54 AM
Slider ముఖ్యంశాలు

మంత్రి జగదీష్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

#NalgondaPolice

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ పోలీసులు అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. సోమవారం రోజున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి, టిఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి వాహనాన్ని, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు సీతక్క వాహనాన్ని పులిమామిడి చెక్ పోస్ట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతించారు.

అదే విధంగా త్రిపురారం చెక్ పోస్ట్ వద్ద శాసన సభ్యుడు భాస్కర్ రావు వాహనాన్ని సైతం క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎన్నికల పటిష్ట నిర్వహణలో భాగంగా పోలీస్ శాఖ పతిష్టమైన చర్యలు తీసుకుంటూ నిరంతర నిఘా ఏర్పాటు చేసింది.

కట్టుదిట్టమైన భద్రత : డిఐజి రంగనాధ్

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను ప్రశాంతంగా, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నిర్వహించడం కోసం పటిష్ఠ చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ, డిఐజి రంగనాధ్ తెలిపారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వెళ్లే అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటు నాగార్జున సాగర్ నుండి మాచర్లకు వెళ్లే రహదారిలో అంతర్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టు వద్ద భద్రత మరింత పెంచామని చెప్పారు.

ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాగం, రిటర్నింగ్ అధికారి సూచనల మేరకు అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నామని చెప్పారు. అదే విధంగా కోవిడ్ రెండో దశ వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు, ఆంక్షలకు అనుగుణంగా పోటీలో ఉన్న అభ్యర్థులకు సూచనలు చేసినట్లు తెలిపారు.

ప్రచారపర్వంలో విధిగా మాస్కులు ధరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. మాస్కులు లేకుండా ప్రచారంలో పాల్గొన్నా, అనుమతులు తీసుకోకుండా సభలు, సమావేశాలు నిర్వహించినా కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఎన్నికల ప్రశాంత నిర్వహణ కోసం ప్రజలు, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు తమతో సహకరించాలని ఆయన కోరారు.

Related posts

మార్గదర్శికి ఏపీ హైకోర్టులో ఊరట

Satyam NEWS

రుతుపవనాలు మరో 4 రోజులు ఆలస్యం

Bhavani

సిలిండర్ లో మాయం అవుతున్న 2 కేజీ ల గ్యాస్

Bhavani

Leave a Comment