28.7 C
Hyderabad
April 28, 2024 03: 28 AM
Slider విజయనగరం

దిశ పోలీస్ స్టేష‌న్ లో బాధితుల‌కు భ‌రోసా …! ఏంటంటే…?

#disapolicestation

పొరుగు రాస్ట్ర‌మైన తెలంగాణ‌లో శంషాబాద్ వెళ్లే ర‌హ‌దారిలో అత్యాచారం ,హ‌త్య‌కు గురైన సాష్ట్ వేర్ ఇంజ‌నీర్ దిశ జ్ఙాపకంతో…ఏపీ రాష్ట్రంలో ఏకంగా దిశ పేరుతో ఏకంగా చ‌ట్ట‌మే తీసుకొచ్చిందీ ప్ర‌భుత్వం. అదే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు సంబంధించి పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేసింది…రాష్ట్ర పోలీస్ శాఖ‌.

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని బ్యారెక్స్ వ‌ద్ద ఆ పేరుతో ఏకంగా మ‌హిళా పోలీస్ స్టేష‌న్ నే  ప్రారంభించారు…సీఎం జ‌గ‌న్. గ‌త ఏడాది నుంచీ రోజ  వంద  మంది చొప్పున బాధితులు స్టేష‌న్ కు వ‌చ్చి స‌మ‌స్య‌ల‌ను చెప్పుకుని…ప‌రిష్క‌రించుకుంటున్నారు.

స్టేష‌న్ కు వ‌చ్చే బాధితుల కోసం…..స్టేష‌న్ లోనే చెట్ల నీడ‌ల‌లో వారి ఫిర్యాదుల‌ను ప్ర‌త్యేకించి తీసుకుంటున్నారు….స్టేష‌న్ ఏఎస్ఐ లు..యాకుబ్,ర‌జ‌నీ లాంటి సిబ్బంది. అయితే మండ‌టెండ‌లో చంటి పిల్ల‌ల‌తో   స్టేష‌న్ కు వ‌స్తున్న బాధితుల క‌ష్టాల‌ను గుర్తించారు..సాటి స్త్రీ…ఎస్పీ రాజ‌కుమారీ.

స్టేష‌న్ కు వ‌చ్చే బాధిత మ‌హిళల కోసం… ఏకంగా ఓ చ‌లి వేంద్రాన్నే ప్రారంభించారు..ఎస్పీ రాజ‌కుమారీ. స్థానిక డీఎస్పీ  త్రినాధ్…ఆధ్వ‌ర్యంలో సిబ్బంది అంతా..స్టేష‌న్ లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని..ఎస్పీ రాజ‌కుమారీ ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా ఎస్పీ మీడియా నుద్దేశించి మాట్లాడుతూ… డీజీపీ ఆదేశాల మేర‌కు..స్టేష‌న్ కు వ‌చ్చే బాదితులు  కొర‌కు చ‌లివేంద్రాన్ని ఏర్పాటు చేసామన్నారు. స‌మస్య‌ల‌ను విన్న‌వించుకునేందుకు… బాథ‌లు చెప్పుకునేందుకు స్టేష‌న్ కు వచ్చిన బాదితుల‌కు ఈ చ‌లి వేంద్రం ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో డీఎస్పీ త్రినాధ్, ఏఏస్ఐలు యాకుబ్,  ర‌జ‌నీ,హెచ్ సీలు ల‌క్ష్మ‌ణ్, కుమార్, లేడీ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

Related posts

గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్

Satyam NEWS

శ్రీచైతన్య జూనియర్ కాలేజి క్యాంపస్ లో కరోనా

Satyam NEWS

చెక్:ఓఐసి సమావేశాల్లో ఇరాన్ ను అడ్డుకున్నసౌదీ

Satyam NEWS

Leave a Comment