30.7 C
Hyderabad
May 5, 2024 04: 08 AM
Slider నల్గొండ

వెల్ఫేర్ విభాగాలను తనిఖీ చేసిన అదనపు ఎస్పీ నర్మద

#Addl.SP.Narmada

పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో మరింత సమర్థవంతంగా సేవలందించేలా వెల్ఫేర్ విభాగం పని చేయాలని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద అన్నారు.

గురువారం ఆమె పోలీస్ వెల్ఫేర్ విభాగంలోని వెల్ఫేర్ ఆర్.ఐ. కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ.ఆర్. సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం గ్యాస్ ఆఫీస్, వాటర్ ప్లాంట్, పోలీస్ క్వార్టర్స్, స్టోర్, పోలీస్ హాస్పిటల్, జిమ్, క్యాంటీన్, లైబ్రరీలతో పాటు పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం కార్యాలయం, కుట్టు శిక్షణా కేంద్రం తదితర విభాగాలను ఆమె తనిఖీ చేశారు.

వెల్ఫేర్ పరిధిలోని అన్ని విభాగాలలో రికార్డుల నిర్వహణ, సిబ్బంది సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యల పట్ల ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు. సిబ్బంది సంక్షేమం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో వారికి అవసరమైన అన్ని రకాల సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. వెల్ఫేర్ పరిధిలోని అన్ని విభాగాలు మరింత సమర్ధవంతమైన సేవలందించడం ద్వారా సిబ్బంది అందరి మన్ననలు పొందేలా పని చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా అమలు చేస్తున్న వెల్ఫేర్ విభాగం పనితీరు గురించి పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులను ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఆమె వెంట ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, వెల్ఫేర్ ఆర్.ఐ. నర్సింహా చారి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, నాయకులు సోమయ్య, వెల్ఫేర్ సిబ్బంది కిషన్, లింగా రెడ్డి, నర్సింహా రెడ్డి, శ్రీనివాస్, జమాల్, రఘు, ఇతర సిబ్బంది ఉన్నారు.

Related posts

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వైసిపి భారీ సభ

Satyam NEWS

పేదలకు నిత్యావసరాలు అందచేసిన బిజెపి నేతలు

Satyam NEWS

సత్యం న్యూస్: క్షీరసాగర మథనం చిత్ర సమీక్ష

Satyam NEWS

Leave a Comment