27.7 C
Hyderabad
May 14, 2024 09: 30 AM
Slider మహబూబ్ నగర్

దళితుడిపై దాడి చేసినా అరెస్టు చేయని పోలీసులు

#Malala Chaitanya Samiti

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం కేంద్రంలో భారత్ పెట్రోల్ బంకులో క్యాషియర్ గా పనిచేస్తున్న దళిత మాల హుస్సేన్ పై కులం పేరుతో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు డిమాండ్ చేశారు.

ఫిబ్రవరి 11వ తేదీన మధ్యాహ్నం అదే బంకులో పనిచేస్తున్న బంక్ ఇంచార్జ్ వాజిద్ హుస్సేన్ వద్దకు వెళ్లి కులం పేరుతో దూషించాడని ఆయన తెలిపారు. దూషించడమే కాకుండా అతడిని బయటికి లాక్కొచ్చి మెట్ల పైనుంచి కాలుతో తన్నాడని ఆయన తెలిపారు. దాంతో కిందికి పడిన దళిత మాల హుస్సేన్ ఎడమ చేయి భుజం ఎముక విరిగిందని ఆయన వివరించారు.

దళిత హుస్సేన్ ను కులం పేరు పెట్టి తిట్టి కొట్టి గాయపరచిన వాజిదుపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని మాలల చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు మూలె కేశవులు డిమాండ్ చేశారు. అంతటితో ఆగగా బలవంతంగా దౌర్జన్యంగా వాజిద్ బైకుపై తీసుకువెళ్లి బంకు దగ్గరనే రెండు గంటలసేపు బంధించి మొబైల్ ఫోన్ బలవంతంగా గుంజుకొని వాడుకున్న డబ్బులు రూ. 18,330 రూపాయలు కట్టి వెళ్లాలని బలవంతం చేశాడని ఆయన తెలిపారు.

ఫిబ్రవరి 11వ తేదీన అచ్చంపేట పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేయగా హుస్సేన్ పై దాడి చేసి గాయపరిచిన వాజిద్ పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా పోలీసులు కాలయాపన చేస్తున్నారు. దళితులపై దాడి చేస్తే ముందస్తు విచారణ లేకుండా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని న్యాయస్థానాలు చెప్తున్నప్పటికీ పోలీసులు కావాలని ఉద్దేశపూర్వకంగా దళిత చట్టాలను నిర్వీర్యపరుస్తున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షులు పంబ వెంకటస్వామి గోఖం బాలచందర్ నరేందర్ ఉపాధ్యక్షులు గోవు విష్ణు మురళి పిల్లి రామస్వామి పిల్లి అంజి మల్లేష్ బాబు స్వామి బాలస్వామి జి మల్లేష్ పి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీస్ ఆయుధాలకు సిఐ పూజలు

Satyam NEWS

సమాచార శాఖ ఎపిఆర్వో ప్రభాకర్ కామ లీలలు

Satyam NEWS

9 ఏళ్లకే దశాబ్ది ఉత్సవాలా?

Satyam NEWS

Leave a Comment