38.2 C
Hyderabad
May 5, 2024 19: 08 PM
Slider వరంగల్

దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ములుగు జిల్లా పోలీస్

#mulugu

ద్విచక్ర వాహనం నుండి రెండు లక్షల 59 వేల రూపాయలను దొంగిలించిన వ్యక్తిని ములుగు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని అపోలో ఫార్మసీ నిలిపి ఉన్న తన ద్విచక్ర వాహనం నుండి రెండు లక్షల 59 వేల రూపాయలు దొంగిలించినట్లు గుర్తించిన  కాసిం దేవి పేట సర్పంచ్ ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ములుగు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా విచారణలో  ద్విచక్ర వాహనం నుండి రెండు లక్షల 59 వేల రూపాయలను చాకచక్యంగా గుర్తుతెలియని దొంగలు  దొంగిలించినట్టుగా గుర్తించారు.

పోలీసులు  దీనిని సవాలుగా తీసుకున్న ములుగు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బి ఓంకార్ యాదవ్ కొద్ది రోజుల్లోనే కేసును ఛేదించారు. ముగ్గురు మహిళలు ఇద్దరు పిల్లలు ఈ చోరీలో సభ్యులుగా ఉన్నట్లు తేలింది. వీరు తాడేపల్లిగూడెం చెందిన వ్యక్తులుగా విచారణలో తేలింది. క్రైమ్ నెంబర్ : 29/23 ములుగు పోలీస్ స్టేషన్ ఐ. పి. సి సెక్షన్ 379 ప్రకారం వీరి మీద నమోదు చేశారు. వద్ద నుండి రెండు లక్షల 39 వేల రూపాయలను  రికవరీ చేసి ఫిర్యాదుదారుడికి అప్పగించి దొంగలను కోర్ట్ కు రిమాండ్ చేయడం జరిగింది.

Related posts

ఆర్టికల్ 370 ఎఫెక్ట్: మంచు కొండల్లో తగ్గిన హింస

Satyam NEWS

మూడు కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రి బొత్స

Satyam NEWS

అనంతపురం స్పందన కార్యక్రమంలో 81 పిటిషన్లు

Satyam NEWS

Leave a Comment