33.2 C
Hyderabad
May 4, 2024 01: 17 AM
Slider ప్రత్యేకం

రాజకీయ ‘చెద’రంగం: కుటుంబ కలహాలవల్లే ఈటలకు పోటు?

#KCRfamily

ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న అంతర్గత పరిణామాల కారణంగానే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బలి అవుతున్నారా?

ఈ ప్రశ్నకు అవునని సమాధానం వస్తున్నది. దీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంలో ఇప్పటికే ఎన్నో ‘‘పవర్ సెంటర్లు’’ ఏర్పడి ఉన్నాయి.

కేసీఆర్ కుమారుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్, కుమార్తె కవిత ల నుంచి చాలా మంది ‘‘శక్తిమంతులు’’ కేసీఆర్ కుటుంబంలో ఉన్నారు.

వీరిలో ఎవరి హవా ఎక్కువా ఉంటుందనే అంశంపై చర్చోపచర్చలు కూడా జరుగుతుంటాయి. ప్రగతిభవన్ గోడల మధ్య ఏం జరుగుతుందో తెలియదు కానీ బయటకు మాత్రం పలు రకాల పుకార్లు వినిపిస్తుంటాయి.

వీటిని ఖండించేవాడు కానీ, కుటుంబంలో ఎలాంటి పవర్ సెంటర్లు లేవు… ఉన్నది ఒక్కడే… అతడే కేసీఆర్ అని చెప్పడానికి గానీ ఎవరూ ప్రయత్నించడం లేదు.

అధికార మార్పిడి జరగబోతున్నదని, ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ ఉన్నత స్థానానికి రాబోతున్నారని కొద్ది కాలం కిందట వీర విధేయులైన మంత్రులే కొందరు చెప్పారు.

అయితే వాటిని కొద్ది రోజుల తర్వాత కేసీఆర్ ఖండించారు. తాను బతికుండగా వేరే వారిని సిఎం చెయ్యనని కుండబద్దలు కొట్టారు.

ఆ తర్వాత వీర విధేయులైన మంత్రులు సైలెంట్ అయిపోయారు కానీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు.

కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తిరుగుబాటు చేస్తారని భావించిన కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాకే పరిమితం అయి బయటకు కూడా రావడం లేదు.

వివిధ జిల్లాలకు చెందిన నేతలతో కలిసేందుకే ఆయన ఇష్టపడటం లేదు. వేరే జిల్లాల వారికి ఆయన అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదు.

దాంతో హరీష్ రావు తిరుగుబాటు చేస్తారనే వార్తలు పూర్తిగా తగ్గిపోయాయి. కేసీఆర్ కుమార్తె కవిత పార్లమెంటు ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఇంటికే పరిమితం అయ్యారు.

ఆ తర్వాత కొద్ది కాలానికి ఎమ్ ఎల్ సి అయ్యారు. ఆ తర్వాత ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయారు. పెద్దగా రాజకీయ కార్యక్రమాలు చేయడం లేదు.

హైదరాబాద్ లో నివాసం ఉంటున్నా కేవలం నిజామాబాద్ జిల్లాకు పరిమితమై పని మాత్రమే చేస్తున్నారు.

పవర్ సెంటర్ లలో ప్రధాన వ్యక్తిగా ఇప్పుడు కేసీఆర్ కు దాదాపుగా దత్తపుత్రుడు లాంటి జోగిన పల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులు కూడా కేసీఆర్ తో మాట్లాడాలంటే సంతోష్ ద్వారానే మాట్లాడే పరిస్థితి నెలకొని ఉంది.

ఇప్పుడు పెద్దాయన మాట్లాడే వీలు లేదు అని సంతోష్ చెబితే ఎవరైనా సరే పక్కకు జరగాల్సిన పరిస్థితే ఉంది.

అన్ని జిల్లాల నేతలను కలుస్తున్నది కూడా ఇప్పుడు సంతోష్ మాత్రమే. కరోనా పాజిటీవ్ వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో చురుకుగా ఉన్న కేటీఆర్ గత రెండు రోజులుగా సైలెంట్ అయిపోయారు.

ఫేస్ బుక్, ట్విట్లర్, వాట్సప్ మెసేజీలు కూడా ఆయన చూడటం లేదు. ఈ పరిణామం తెలిసిన వారు అప్పుడే ఏదో కీడును శంకించారు.

పార్టీలోనో, ప్రభుత్వంలోనో ఏదో పెద్ద కుదుపు రాబోతున్నదని ఊహించారు. అయితే కరోనా కారణంగా ఆయన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా లేరని సర్ది చెప్పుకున్నారు.

కరోనా సోకినా ఇతరులకు సాయం చేయడం మానని కేటీఆర్ అంటూ వార్తలు కూడా రాయించుకున్నారు.

అయినా రాజకీయంగా ఏదో జరగబోతున్నదనే ప్రచారం మాత్రం ఆగలేదు.

మరీ ముఖ్యంగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్న కేసీఆర్ బంధుగణం ఏదో ఉప ద్రవం ముంచుకు వస్తున్నదనే ఊహించారు.

చాలా కాలంగా మంత్రి  ఈటల రాజేందర్ కు కేటీఆర్ కు పొసగడం లేదు. ఈటల రాజేందర్ ను హరీష్ రావుకు సన్నిహితుడుగా చెబుతుంటారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ గులాబి జెండాపై హక్కు ఉంటుందని బాహాటంగా ప్రకటించిన ఈటల రాజేందర్ కు కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదు.

చాలా కాలంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం అనే అంశంపై ఏదో ఒక రకంగా ఈటల అడ్డుపడుతూనే ఉన్నారు. బాహాటంగా ఇది కనిపిస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యాన్ని ప్రశ్నార్ధకం చేసే విధంగా టీఆర్ఎస్ అధికార మీడియా లోనే వార్తలు వెలువడ్డాయి.

టీఆర్ఎస్ అధికార మీడియానే కాకుండా టీఆర్ఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉండే వారి ఛానెళ్లు మాత్రమే ఈటల రాజేందర్ పై దారుణమైన కామెంట్లతో వార్తలు ప్రసారం చేశాయి……ఇ

దంతా కేసీఆర్ కు తెలిసి జరిగిందా? లేదా??? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Related posts

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కుమ్ముక్కు రాజకీయం?

Bhavani

కోరుకొండ, నవోదయ ప్రవేశ పరీక్షలకు త్రిశూల్ శిక్షణ

Satyam NEWS

9వ రోజుకు చేరిన మల్లంపల్లి మండల సాధన సమితి దీక్ష

Satyam NEWS

Leave a Comment