28.7 C
Hyderabad
April 28, 2024 05: 18 AM
Slider కవి ప్రపంచం

నేడే మేడే

#K.Haranath New Photo

కదలిరా కదలిరా

కలసి కట్టుగా కదలిరా

భారతావని శ్రామికుడా

జగతి రథ ప్రగతి కార్మికుడా

కటిక నేల చీల్చి నీవు

సిరుల పంట రాల్చినావు

ఉక్కు ముక్క మలచి నీవు

గగన వీధి నిలిచినావు

చేనేత నేతవై

దాతవై విధాతవై

శ్రమదానోద్యమ

సమరభేరి మ్రోగించగ

శ్రమైక శక్తివై నిలిచినావు

ప్రకృతి మాతకు

పరమాత్మవు నీవు

యుగయుగాల చరిత్ర నీది

ప్రతి యుగానికి

ప్రతీక వీవు

ఉదయించే సుప్రభాత సూర్యుడా

అస్తమయం నీకు లేదు

సమస్త జగతి నీ హస్తమయం

నేడే మేడే అందుకొనుము

సలామ్ సలామ్

లాల్ సలామ్

కె.హరనాథ్, 9703542598

Related posts

అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో ఆరాదిస్తే అన్ని శుభాలే

Satyam NEWS

సోషల్ మీడియాపై పాత కక్షలు తీర్చుకుంటున్నారు

Satyam NEWS

శ్రీశైల మహా క్షేత్రంలో నేటి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

Bhavani

Leave a Comment