27.7 C
Hyderabad
May 4, 2024 10: 10 AM
Slider మహబూబ్ నగర్

రోడ్డు వెడల్పు లో ప్రజా ప్రతినిధుల కుమ్మక్కు రాజకీయాలు

వనపర్తి ప్రజల చిరకాల వాంఛ అయిన రోడ్డు వెడల్పు కార్యక్రమం నిదానంగా, సాఫీగా సాగుతున్న క్రమంలో, రోడ్డు మధ్య నుండి 40 ఫీట్లుగా నిర్ణయించి చేస్తున్న క్రమంలో గాంధీ చౌక్ నుండి మున్సిపాలిటీ వరకు అధికారులు ప్రజాప్రతినిధుల లాలూచీతనంతో 100 వరకు మలుపులు.

ఒక దగ్గర 38 ఫీట్లు, ఒక దగ్గర 40 ఫీట్లు ఒక దగ్గర 42 ఫీట్లు చేస్తూ అక్రమాలకు పాల్పడదాన్ని ఖండిస్తూ ప్రజలు, అఖిలపక్ష ఐక్యవేదిక కలెక్టర్ ఆఫీసు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆసీష్ సాంగ్వన్ కు వినతి పత్రం ఇచి వివరించామని అఖిల పక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ చెప్పారు.

ఆయన కమిషనర్ ను పిలిచి రోడ్డు వెడల్పును సక్రమంగా చేయవలసిందిగా ఆదేశించారు.ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ రోడ్డు వెడల్పులో అక్రమాలు సరిచేయకుంటే హెచ్.ఆర్.సి. ని సంప్రదించవలసి ఉంటుందని, అలాగే అధికారులపై లోకాయుక్తకు ఫిర్యాదు చేయవలసి ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షుడు వెంకటేష్, జానంపేట రాములు, కార్యదర్శి రమేష్, అడ్వకేట్ ఆంజనేయులు, గోపాలకృష్ణ నాయుడు, శ్రీనివాసులు, రాములు బాధిత ప్రజలు పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

విజయవాడలో క్యాన్సర్ పై అవగాహనా కార్యక్రమం

Satyam NEWS

అసభ్య కామెంట్ చేసిన అయ్యన్నపాత్రుడిపై కేసు పెట్టాలి

Satyam NEWS

నేను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు కరెక్టు కాదు

Satyam NEWS

Leave a Comment